BigTV English

Padi Kaushik Reddy: అరెస్టు చేస్తే చచ్చిపోతా.. కౌశిక్ రెడ్డిపై మరో కేసు..!

Padi Kaushik Reddy: అరెస్టు చేస్తే చచ్చిపోతా.. కౌశిక్ రెడ్డిపై మరో కేసు..!

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. 3 రోజుల క్రితం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హల్చల్ చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కూడా అరెస్ట్ చేస్తే చచ్చిపోతానని డ్రామా క్రియేట్ చేసి పోలీసులను బెదిరించారు. దీంతో ఆయనపై రెండో కేసు నమోదు చేశారు గచ్చిబౌలీ పోలీసులు.


బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. 3 రోజుల క్రితం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హల్చల్ చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కూడా అరెస్ట్ చేస్తే చచ్చిపోతానని డ్రామా క్రియేట్ చేసి పోలీసులను బెదిరించారు. దీంతో ఆయనపై రెండో కేసు నమోదు చేశారు గచ్చిబౌలీ పోలీసులు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం. బంజారాహిల్స్ పీఎస్ లో తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ సీఐ రాఘవేంద్ర కంప్లయింట్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన 20 మంది అనుచరులపై కేసు నమోదయ్యింది. గురువారం ఉదయం కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు. అంతకు ముందు మాజీ మంత్రి హరీష్ రావ్, జగదీశ్ రెడ్డితో పాటు.. పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కౌశి్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ ప్రయత్నించగా.. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి గచ్చిబౌలీ పీఎస్ కి తరలించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.


అయితే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ MLA కౌశిక్ రెడ్డి నానా హంగామా చేశారు. ఓ ఫిర్యాదు చేయడం కోసం బంజారాహిల్స్ PSకు వెళ్లారు కౌశిక్ రెడ్డి.. ఇదే టైంలో సీఐకి అర్జెంట్ పని ఏర్పడ్డంతో బయటకు వెళ్తేందుకు యత్నించారు. తన కంప్లైంట్ తీసుకోవాలంటూ పోలీసులను ఫోర్స్ చేశారు కౌశిక్ రెడ్డి. కారులో బయటకెళ్తున్న CI ని తన అనుచరుల సాయంతో అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి. బయటకు వెళ్తున్న సీఐ మళ్లీ వెనక్కి వచ్చి వీరి కంప్లైంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐతో చాలా సేపు కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు పోలీసులు.

Also Read:  రేవంత్ అన్నకి హృదయ పూర్వక అభినందనలు: వైఎస్ షర్మిల

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నాడా.. రౌడీ అనుకుంటున్నాడా.. అని ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్. కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో పావుగా మారాడని విమర్శించారు. చిల్లర రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు. MLA అనే అహంకారం నెత్తికెక్కితే కౌశిక్ రెడ్డిలా తయారవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సెటైర్లు వేశారు. తాను సోషల్ మీడియా స్టార్ అవ్వాలని అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. సొంత పార్టీకి మోసం చేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అంటూ.. బీఆర్ఎస్ నేతలను ఉతికి ఆరేశారు బల్మూరి.

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందనీ. ఒక ఎమ్మెల్యే అన్న కనీస మర్యాద కూడా లేకుండా.. కౌశిక్ రెడ్డి హక్కులను హరించడం ఎంత మాత్రం తగదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కౌశిక్ రెడ్డి పై 57,126 (2) 132 ,224,333,351(3).. సెక్షన్లతో పాటు.. 191( 2) R/W 190 R/W 3 (5) సెక్షన్స్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఫిర్యాదు చేసేందుకు వస్తే తమపైనే కేసు పెట్టారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కోర్టులో రిమాండ్‌ను చాలెంజ్ చేస్తామంటున్నారు కారు పార్టీ లీడర్లు.

Related News

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Big Stories

×