BigTV English

Allu Arjun: అల్లు అర్జున్‌కు షాకిచ్చిన ఫ్యాన్, ఏకంగా 1600 కిలోమీటర్లు సైకిల్‌పై.. అభిమానాన్ని ఆపలేం సార్!

Allu Arjun: అల్లు అర్జున్‌కు షాకిచ్చిన ఫ్యాన్, ఏకంగా 1600 కిలోమీటర్లు సైకిల్‌పై.. అభిమానాన్ని ఆపలేం సార్!

Allu Arjun: ఆవేశాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేం సార్.. కొందరు ఫ్యాన్స్ చేసే పనులు చూస్తుంటే ఈ సినిమా డైలాగే గుర్తొస్తుంది. తమ ఫేవరెట్ హీరోలను, హీరోయిన్లను కలవడం కోసం అభిమానులు చేసే పనులకు లిమిటే ఉండదు. అలాగే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవడం కోసం ఒక అభిమాని.. దాదాపు 1600 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చాడు. ఫైనల్‌గా తనను నేరుగా కలిసి తన కోరిక తీర్చాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ నిజంగానే ఒక ప్యాన్ ఇండియా స్టార్ అని, అందుకే తనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని తన ఫ్యాన్స్ అంతా గర్వంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.


అల్లు అర్జున్ షాక్

కష్టపడి అంత దూరం నుండి వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌ను నేరుగా చూడగానే, కలవగానే ఎమోషనల్ అయిపోయాడు ఆ అభిమాని. అంత దూరం నుండి వచ్చాడు కాబట్టి కాసేపు తనతో మాట్లాడాడు బన్నీ. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని తనను అడగగా ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చానని సమాధానం చెప్పాడు. అయిదు రోజుల నుండి మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను, ఫైనల్‌గా మిమ్మల్న కలిశాను అంటూ బన్నీ కాళ్లపై పడి ఎమోషనల్ అయిపోయాడు. మిమ్మల్ని నేరుగా చూశాను చాలు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు తాను దాదాపు 1600 కిలోమీటర్ల దూరం నుండి సైకిల్‌పై వచ్చానని రివీల్ చేశాడు ఆ అభిమాని. అది విని అల్లు అర్జున్ షాకయ్యాడు.


Also Read: బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థతో మైత్రి బిగ్గెస్ట్ డీల్… పెద్ద ప్లానే

ఫ్లైట్‌లో పంపిస్తా

తిరిగి వెళ్లేటప్పుడు సైకిల్‌పై వెళ్లనివ్వద్దని ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేయమని తన టీమ్‌ను ఆదేశించాడు అల్లు అర్జున్. కానీ అతడు మాత్రం బన్నీని కలవడమే గొప్ప విషయమని, ఎలా వచ్చానో అలా తిరిగి వెళ్లిపోతానని అన్నాడు. కానీ బన్నీ.. తన మాట వినలేదు, తనను సేఫ్‌గా తిరిగి పంపించే బాధ్యతను తన టీమ్‌కు అప్పగించాడు. తన సొంతూరు అలీఘడ్ అని, అక్కడి నుండి అసలు సైకిల్‌పై ఏ రూట్‌లో వచ్చాడో అల్లు అర్జున్‌కు వివరించాడు. నేను పుష్ప 2 ప్రమోషన్ కోసం అలీఘడ్ వస్తే అక్కడ నిన్ను కలుస్తాను అంటూ ఫ్యాన్‌కు మాటిచ్చాడు అల్లు అర్జున్. అది విని తన అభిమాని మరింత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనకోసం, తను బాగుండాలి గుడికి వెళ్లి వచ్చానని అన్నాడు.

డబ్బు సాయం

నువ్వు సైకిల్‌పై అస్సలు తిరిగి వెళ్లొద్దు అని తన అభిమానికి గట్టిగా చెప్పాడు అల్లు అర్జున్. అంతే కాకుండా తనకు సాయంగా కొంచెం డబ్బులు కూడా ఇవ్వమని తన టీమ్‌కు చెప్పాడు. చివరికి తగ్గేదె లే డైలాగ్‌ను హిందీలో చెప్పి, అల్లు అర్జున్‌తో ఫోటోలు దిగి హ్యాపీగా తిరిగి వెళ్లిపోయాడు ఆ అభిమాని. ప్రస్తుతం ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అల్లు అర్జున్‌ది మంచి మనసు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తనను కలవడానికి వచ్చిన అభిమాని గురించి ఇంత ఆలోచిస్తున్నాడని అనుకుంటున్నారు. అంతే కాకుండా డిసెంబర్ 6న విడుదలయ్యే ‘పుష్ప 2’ కోసం ఎదురుచూస్తున్నామని గుర్తుచేస్తున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×