BigTV English
Advertisement

Ram Gopal Varma : బయోపిక్ చేయడానికి రెడీ అయ్యాడా… అందుకే ఈ ట్వీట్స్ చేస్తున్నాడా..?

Ram Gopal Varma : బయోపిక్ చేయడానికి రెడీ అయ్యాడా… అందుకే ఈ ట్వీట్స్ చేస్తున్నాడా..?

Ram Gopal Varma : సెన్సేషనల్ డైరెక్టర్ ఏం చేసినా అది సంచలనంగానే మారుతుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన వరస ట్వీట్స్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు.


సల్మాన్ వివాదంపై వరుస ట్వీట్స్ 

సాధారణంగా ఆర్జీవి అంటే పలు వివాదాస్పద అంశాలతో పాటు ఆయన తీసిన వివాదాస్పద సినిమాలు కూడా గుర్తొస్తాయి. అయితే తాజాగా ఇటీవల కాలంలో వివాదాస్పదమైన సల్మాన్ ఖాన్, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి వరుసగా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఆయన చేసిన ట్వీట్స్ కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ను చంపాలనుకుంటున్న వార్త దుమారం రేపగా, సల్లూ భాయ్ కి సన్నిహితుడైన సిద్ధిఖీని తాజాగా లారెన్స్ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్జీవి 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింక ను వేటాడిన టైంలో లారెన్స్ బిష్ణోయ్ కేవలం ఐదేళ్ల వయసు ఉన్న పిల్లాడని, అలాంటి వ్యక్తి 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం చూస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.


బయోపిక్ తీయబోతున్నాడా?

అయితే తాజాగా ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేస్తూ ఆర్జీవి తనకు ఎక్స్ లో 6.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారని, తను లారెన్స్ బిష్ణోయ్ పై చేసిన ట్వీట్ ను, 6.2 మిలియన్ల మంది చూశారంటే ప్రస్తుతం అతనికి ఈ దేశంలో ఉన్న పాపులారిటీ ఏంటో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి వార్నింగ్ ఇవ్వాలని, ఇలా సూపర్ కౌంటర్ ఇవ్వకపోతే అది టైగర్ స్టార్ పిరికితనంలాగా కనిపిస్తుంది అంటూ సెటైర్ వేశారు. అంతేకాకుండా బిగ్గెస్ట్ గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా సినిమా తీస్తే దావూద్ ఇబ్రహీం లేదా చోటా రాజన్ లా కనిపించే వ్యక్తిని ఏ ఫిలిం మేకర్ నటింపచేయడని, కానీ బీ కంటే ఎక్కువ అందంగా ఉన్న ఒక్క సినిమా స్టార్ కూడా తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్జీవి. ఇలా ఆర్జివీ చేస్తున్న వరుస ట్వీట్స్ చూస్తుంటే ఆయన గ్యాంగ్ స్టర్ లారెన్స్, సల్మాన్ ఖాన్ పై సినిమా తీయబోతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ అనుమానాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియదు కానీ ఆర్జీవి ఈ పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సల్మాన్ ఖాన్ ‘హమ్ సాత్ సాత్ హై’ అనే మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో ఓ కృష్ణ జింకను వేటాడాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. 1998లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చాలా రోజులుగా సల్మాన్ ఖాన్ తో పాటు అతని అనుచరులకు కూడా లారెన్స్ వార్నింగ్ ఇస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల ఎన్సిపి నేత, సల్మాన్ సహచరుడు బాబా సిద్ధిఖీని హత్య చేసినట్టుగా ప్రకటించుకున్నారు లారెన్స్ గ్యాంగ్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×