Pushpa2 Event : ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒక్కటే మాట పుష్ప 2.. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తూ యూనిట్ మొత్తం సందడి చేస్తున్నారు. తాజాగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ భారీ ఎత్తున అభిమానులు రావడంతో పాటుగా ముఖ్య అతిథులుగా పలువురు డైరెక్టర్స్ విచ్చేసారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు హైలెట్ అయ్యాయి. ఏ సినిమాకు అయిన ఆయన పేజీలు ప్రసంగాన్ని ఇస్తారు కానీ ఈ మూవీకి మాత్రం తక్కువ మాట్లాడటంపై సోషల్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. అల్లు అరవింద్ ఏం మాట్లాడారో ఒక్కసారి తెలుసుకుందాం..
పుష్ప 2 ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల క్రితమే సినిమా చూశానని, షో అయ్యాక ఇంట్లో భార్య పలకరించి మొహం ఏంటి ఇంత వెలిగిపోతుందని అడిగారట. దానికి సమాధానంగా అరవింద్ పుష్ప 2 బాగుందని, బ్రహ్మాండంగా నచ్చిందని అన్నారట. దానికావిడ నీ మొహం ఇన్ని సంవత్సరాల్లో రెండుసార్లే ఇలా వెలగడం చూశాను, ఒకటి మగధీర రిలీజ్ కు ముందు మరొకటి ఇప్పుడు పుష్ప 2 ముందు అన్నారట. అంటే దశాబ్దాల అనుభవంలో అరవింద్ అరుదైన క్షణాలు ఇవేనన్న మాట.. అయన పుష్ప 2 తో పాటుగా మగధీర గురించి కూడా మాట్లాడటం ఆసక్తిగా మారింది. ఈ స్టేజ్ మీధ అల్లు అర్జున్ సినిమాల గురించి చెప్పడంతో పాటుగా రామ్ చరణ్ మగధీర పై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన ఆనందాన్ని అల్లు అరవింద్ ఈ రకంగా ఆస్వాదించడాన్ని అభిమానులు ఈ రోజు చూశారు. ఇలాంటి హిట్లు, బ్లాక్ బస్టర్లు గతంలో ఆయన ఎన్నో చూశారు. చిరంజీవి హీరోగా తీసిన ఎన్నో చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాయి. కానీ వాళ్లిద్దరూ ఒకే తరానికి చెందినవాళ్లు, అందులోనూ స్నేహితుల్లా మెలిగిన వారు కాబట్టి పైకి చెప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ పిల్లలు సాధిస్తున్న వాటిని చూస్తూ ఆ సంతోషాన్ని వ్యక్తపరిచే సందర్భం వచ్చినప్పుడు మాత్రం వదులుకోకూడదు. అరవింద్ అదే చేశారు. ఇది మెగా ఫ్యాన్స్ కు కాస్త సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి.
ఇప్పటికే కొన్ని కారణాల వల్ల వీరి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసిందే. ఈ ఈవెంట్ కు చిరంజీవి వస్తారని అనుకున్నారు. కనీసం ఒక్క మెగా హీరో కూడా రాకపోవడంతో ఆయన నీరాశాను వ్యక్తం చేశారని తెలుస్తుంది. దాంతోనే మెగా హీరోల గురించి ప్రస్థావించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఉప్పునిప్పు గా మారిన నేపథ్యంలో ఇలాంటివి చెప్పడం అవసరం. పుష్ప 2 గురించి వచ్చిన గెస్టులు ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే మాత్రం డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో రచ్చ ఓ రేంజ్ లో ఉండబోతోందనేది అర్థమైపోయింది. అరవింద్ ఒక్కరే కాదు అతిథులుగా డైరెక్టర్స్ పుష్ప 2 పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..