OTT Movie : ఎంగేజింగ్ గా ఉండడంతో పాటు సడన్ గా ట్విస్ట్ ఇచ్చి భయపెట్టే హర్రర్ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు బాగా ఆసక్తిని కనబరుస్తారు. అందుకే ఇటీవల కాలంలో ఎన్నో హారర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అయితే ఒకే ఒక్క సినిమా మాత్రం గత 50 ఏళ్లలో తీసిన హర్రర్ సినిమాలలో మోస్ట్ డేంజరస్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ ని చూసారంటే పార్ట్స్ అన్ని ప్యాక్ అవడం ఖాయం. మరి ఇంతటి భయంకరమైన సినిమా ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏమిటో? తెలుసుకుందాం పదండి. వివరాల్లోకి వెళ్తే….
సాధారణంగా హర్రర్ సినిమాలను చూస్తే మనం మర్చిపోలేము. కానీ ఈ సినిమాను చూసామంటే మాత్రం ఏళ్ల పాటు నిద్ర కూడా పట్టదనే టాక్ ఉంది. సాధారణంగా భయంకరమైన హర్రర్ మూవీ అనగానే ది ‘కంజురింగ్’ లాంటి సినిమాల పేర్లు వినిపిస్తాయి. కానీ ఒక్కసారి గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సినిమా ఇది కాదు. ఇంతకంటే దారుణంగా ఉండే మూవీ ఉంది. ఆ భయంకరమైన మూవీ పేరు మరింటో కాదు ‘ది ఎక్సోర్సిస్ట్’ (The Exorcist). ఈ సినిమా గత 50 ఏళ్లలో అత్యంత భయంకరమైన మూవీగా పేరు తెచ్చుకుంది. స్కాట్లాండ్ ఐలాండ్, ఇంగ్లాండ్ లాంటి దేశంలో ఈ మూవీని బ్యాన్ చేశారంటేనే ఎంత భయంకరంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. విలియం పీటర్ బ్లాటి అనే రైటర్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా 1973లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ మూవీ ని చూడడానికి చాలామంది సుస్సు పోసుకున్నారట. ముఖ్యంగా హాట్ ప్రాబ్లం ఉన్నవారికి ఈ సినిమాను చూడడానికి అనుమతిని ఇవ్వలేదట. ఇక ఈ మూవీ ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందినట్టు తెలుస్తోంది.
ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయ్యాక నిర్మాతలు ఆడుతుందో లేదో అనుమానంతో యునైటెడ్ స్టేట్స్లో కేవలం 25 థియేటర్లలోనే రిలీజ్ చేశారట. కానీ అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత ఇతర దేశాలలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఇక అప్పట్లో ఈ మూవీ చూసిన ప్రేక్షకులు థియేటర్లలోనే భయంతో గగ్గోలు పెట్టారట. చాలామంది ఆ భయంకరమైన సీన్స్ చూడలేక మూవీ స్టార్ట్ అయిన కాసేపటికే బయటకు వెళ్లిపోయారట. ఏదైతేనేమీ అత్యంత భయంకరమైన సినిమాగా ఈ మూవీ ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్న తొలి హారర్ మూవీ ‘ది ఎక్సోర్సిస్ట్’ (The Exorcist) రికార్డుకు ఎక్కింది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఎన్నో సినిమాలకి ప్రేరణగా నిలిచింది. హర్రర్ సినిమాలు ఇప్పటివరకు థియేటర్లలోకి ఎన్నో వచ్చాయి. అయితే భయంకరమైన సినిమా అంటే గుర్తుకు వచ్చేది మాత్రం ‘ది ఎక్సోర్సిస్ట్’ (The Exorcist).