BigTV English
Advertisement

Allu Arjun: నేను కారులో దాక్కున్నాను.. ఆరోజు రాత్రి అసలేం ఏం జరిగిందో చెప్పిన అల్లు అర్జున్

Allu Arjun: నేను కారులో దాక్కున్నాను.. ఆరోజు రాత్రి అసలేం ఏం జరిగిందో చెప్పిన అల్లు అర్జున్

Allu Arjun: అభిమాని లేనిదే హీరోలు లేరులే అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ మాట అక్షర సత్యం. అభిమాని అనేవాడు లేకపోతే హీరోలు అనేవారు ఉండరు. అలాగే అభిమానులను కూడా తమ  సొంత ఫ్యామిలీగా చూసుకొనే హీరోలు కూడా ఉండాలి.  అలాంటి హీరోలు తెలుగులో ఉన్నారు అని చెప్పుకోవడం ఎంతైనా గర్వకారణం.


ఇక ఒక అభిమానికి ఉండే ఏకైక కోరిక ఏంటి అంటే.. ఒక్కసారైనా తమ అభిమాన హీరోను కళ్లారా చూడాలని. దాన్ని ఫుల్ ఫీల్ చేసుకోవడానికే ప్రతి అభిమాని ఎదురుచూస్తూ ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు.. అభిమానులను ఎవరు ఆపలేరు. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎంత జనం ఉన్నా.. అక్కడ కరెంట్ స్తంభాలే ఉన్నా.. పెద్ద పెద్ద  గోడలే  ఉన్నా.. వదలరు. కచ్చితంగా ఆరోజు హీరోను చూడడానికి ఎంతకైనా తెగిస్తారు.  ఆ సమయంలో హీరో లేచి వారికి అభివాదం చేసికనిపించకపోతే  అక్కడ యుద్దాలు జరగడం ఖాయం.

ఇక అదే విషయాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.  గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్.. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయం తెల్సిందే. పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృత్యువాత  పడిన విషయం విదితమే. దీంతో బన్నీపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న బన్నీపై.. నేడు అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


థియేటర్ వాళ్ళు రావద్దని చెప్పినా  అల్లు అర్జున్ వచ్చాడని, రేవతి మృతి చెందిన విషయం తెలిసి  కూడా బన్నీ మాట్లాడలేదని  వార్తలు  గుప్పుమంటున్నాయి. ఇక అసలు ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే..  ” ఇదేమి రోడ్ షో కాదు. నేను అక్కడ కారులో వస్తుంటే  పోలీసులు వాళ్లే అక్కడంతా క్లియర్ చేసి ముందుకు రమ్మన్నారు. నేను పర్మిషన్ ఉందనుకొని వెళ్ళాను. థియేటర్ కు దగ్గరకు రాగానే కారు ఆగిపోయింది. ఒక పాయింట్ తరువాత జనం ఎంత గుమికూడి పోతారంటే మీరు కనపడితే కానీ అసలు వెళ్లరు.

బౌన్సర్లు కానీ, పోలీసులు కానీ అందరు వచ్చి అడుగుతారు. సార్.. మీరు లేచి ఒక్కసారి చెయ్యి లేపండి సార్.. వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఎప్పటిలానే  లేచి చేతులు ఊపాను. అది నేనే కాదు  ఎవరైనా అలానే చేస్తారు. మనం చేయి ఊపితేనే వాళ్లు జరుగుతారు. ఓకే మేము చూసాం ఒక సాటిస్ ఫ్యాక్షన్ తో కదులుతారు. వారికి అలా చెప్పడం నా మర్యాద.

వేలమంది నన్ను చూడడానికి వచ్చినప్పుడు నా కారు లోపల నేను దాక్కొని  కూర్చున్నాను. ఆ సమయంలో వారికి ఏం కావాలి.. హీరోది ఒక గ్లింప్స్ మాత్రమే. అది కూడా ఇవ్వకుండా కారులోనే పొగరు చూపిస్తూ హా వస్తారులే.. అంతేలే అని అనుకుంటున్నా. ఆరోజు కూడా లేచి అందరికీ నమస్కారం పెట్టి.. థాంక్యూ.. థాంక్యూ..పదండి.. పదండి అని చెప్పాను. నేను చేప్తేనే వాళ్లు వెళ్తారు. అది థియేటర్ లో జరిగేది” అని చెప్పుకొచ్చాడు. ఆరోజు రాత్రి కూడా ఇదే జరిగిందని అల్లు అర్జున్ తెలిపాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×