Pushpa 2 Day 2 collection: పుష్ప.. పుష్ప పుష్ప రాజ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరే వినిపిస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన సూపర్ యాక్షన్ మూవీ పుష్ప 2. ఈ మూవీ థియేటర్ లలోకి వచ్చి రెండు రోజులు అయ్యింది. కొన్ని చోట్ల విమర్శలు వినిపిస్తున్నా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు.. ఎక్కడా తగ్గేదేలే. మొదట ఓపెనింగ్స్ కాస్త తగ్గిన మళ్లీ ఎండ్ ఆఫ్ ది డే కు వసూళ్లు పుంజుకున్నాయని తెలుస్తుంది. పుష్ప 2 ఊహించినట్లుగానే బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమ లో మునుపెన్నడూ లేని విధంగా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు పుష్పరాజ్.. ఇక మొదటి రోజు 184 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇక రెండో రోజు 300 కోట్ల గ్రాస్ ను రిచ్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి పుష్ప రాజ్ రెండో రోజు ఎంత రాబట్టాడో ఒక్కసారి తెలుసుకుందాం..
ఐకాన్ స్టార్ దెబ్బకు స్టార్లు, సూపర్‌స్టార్ల రికార్డులు బద్ధలవుతున్నాయి. తొలిరోజు విశ్వ రూపం చూపించిన బన్నీ.. రెండో రోజు ఎలాంటి వసూళ్లు సాధిస్తాడో చూడాలి. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్పారాజ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలకపాత్రలు పోషించారు. మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా భారీ హైప్ ను తీసుకురావడంతో ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త షికారు చేస్తుంది.
మొదటి రోజు వసూళ్లను చూస్తే.. దేశ వ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దుమ్ములేపిండు పుష్పరాజ్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.90 కోట్లు, హిందీలో రూ.69 కోట్లు, మలయాళంలో రూ. 6 కోట్లు, తమిళనాడులో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ. 2కోట్లు , రెస్టాఫ్ ఇండియా లో రూ. 7 కోట్లు చొప్పున పుష్ప 2 ఓపెనింగ్స్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 250 కోట్లు అందుకుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. అదే విధంగా రెండో రోజు మొత్తంగా కలిపి 296 కోట్లు వరకు వసూల్ చేసిందని పుష్ప 2 టీమ్ ప్రకటించారు. అంటే రెండు రోజులకే రూ. 300 కోట్లు వసూల్ చేసేంది.. ఇక వీకెండ్ కే 500 కోట్లు సులువుగా అందుకుంటుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. మొత్తానికి కల్కి రికార్డులను త్వరలోనే బ్రేక్ చేస్తుందని తెలుస్తుంది. చూడాలి మూడో రోజు ఎంత వసూల్ చేస్తుందో.. ఏది ఏమైనా పుష్ప రాజ్ హవా కొనసాగుతుంది. ఈ వీకెండ్ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.