BigTV English

OTT Movie : అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసే దయ్యాలు…. వణుకు పుట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసే దయ్యాలు…. వణుకు పుట్టించే హర్రర్ మూవీ

OTT Movie : ఏ భాషలో వచ్చిన హర్రర్ సినిమా అయినా మెయిన్ కాన్సెప్ట్ ఒక్కటే, దయ్యాలతో ప్రేక్షకులను భయపెట్టడం. ఈ సినిమాలు చూసేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్ తోనే సగం ప్రాణం పోతుంది. కొన్ని సినిమాలు భయ పెట్టడానికే పుట్టాయి అనే విధంగా ఉంటాయి. ఈవిల్ డెడ్ మూవీ ఏ విధంగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. అటువంటి ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘సస్పిరియా‘ (Suspiria). ఈ మూవీ మంచి కంటెంట్ తో వచ్చిన ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ. హీరోయిన్ డాన్స్ మీద అభిమానంతో, ఆ కలను నేర్చుకోవడానికి ఒక చోటికి వెళుతుంది. అక్కడ దయ్యాలతో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ఎప్పటినుంచో డాన్స్ నేర్చుకోవాలని కలలు కంటూ ఉండేది. అమెరికాలో ఉంటున్న హీరోయిన్ బెర్లిన్ లో ఒక ప్రముఖ డాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ డాన్స్ నేర్చుకోవడానికి ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్తుంది. అక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్లు ఆమెను తనకు వచ్చిన డాన్స్ వేసి చూపించమంటారు. ఈమెకు వచ్చిన విధంగా డాన్స్ వేస్తుంది. హీరోయిన్ డాన్స్ చేస్తుంటే, అందులోనే ఉన్న బ్లాక్ మేడం అనే మహిళ పరవశించి పోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ ఒక గదిని కేటాయిస్తారు. అందులో ఇంతకుముందు పట్టిసీయ అనే అమ్మాయి డాన్స్ నేర్చుకుంటూ ఉండేది. ఆమె ఒక రోజు సైకాలజిస్ట్ అనే డాక్టర్ దగ్గరికి కంగారుపడుతూ వెళ్ళి, నేను నేర్చుకుంటున్నా డాన్స్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ మంత్రగత్తెలని చెబుతుంది. ఆ డాన్స్ స్కూల్లో అమ్మాయిలు మాయం అయిపోతున్నారని ఆ డాక్టర్ తో చెబుతూ కంగారుగా వెళ్ళిపోతుంది. అప్పటినుంచి ఆ అమ్మాయి కనపడకుండా పోతుంది. సైకాలజిస్ట్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు ఆ డ్యాన్స్ స్కూల్ కు వెళ్లి వాళ్లను విచారిస్తారు. వాళ్ళందరూ మంత్రగత్తులు కావడంతో ఆ పోలీసులకు మైండ్ సెట్ మార్చేస్తారు.

డాన్స్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్లందరూ మంచివాళ్లంటూ చెప్పి బయటకు వెళ్లిపోతారు. డాక్టర్ కి కూడా ఈ రోజుల్లో దెయ్యాలు ఎందుకుంటాయంటూ, వాళ్లు మంచివారని పోలీసులు చెప్తారు. అయితే మరోవైపు క్రిస్టియా అనే అమ్మాయిని ఒక గదిలో బంధించి ఉంటారు. ఆమె విచిత్రంగా మెలికలు తిరుగుతూ ఎముకలు విరిగే విధంగా తన బాడీని తిప్పుతూ ఉంటుంది. ఇలా కొంతమంది ఆ గదిలో ఉంటారు. హీరోయిన్ డాన్స్ ను చూసి బ్లాక్ మేడం ఆమెను మెచ్చుకుంటుంది. ఆ డాన్స్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ మంత్రగత్తెలే. వీళ్లు డాన్స్ నేర్పిస్తామంటూ అమ్మాయిలను ట్రాప్ చేసి, వాళ్లలో బెస్ట్ గా ఉన్న ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఇంట్లోనే ఉన్న మదర్ మార్సస్ అనే వృద్ధ మహిళ శరీరంలోకి హీరోయిన్ ఆత్మని  పంపించాలనుకుంటారు. అందుకోసమే హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. చివరికి హీరోయిన్ శరీరంలోకి ఆ మాంత్రికురాలి ఆత్మను పంపిస్తారా? ఆ ఇంటి నుంచి హీరోయిన్ బయటపడుతుందా? సైకాలజిస్ట్ ఆమెకు ఏ విధంగా సహాయ పడగలుగుతాడు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హర్రర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×