OTT Movie : రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను మూవీ లవర్స్ బాగా ఇష్టపడతారు. ఎందుకంటే కామెడీ కంటెంట్ తో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా ఉండటంతో ఈ మూవీస్ కనువిందు చేస్తాయి. కొన్ని సన్నివేశాలు ఒంట్లో వేడి పుట్టించే విధంగా కూడా ఉంటాయి. హాలీవుడ్ సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో మసాలా సన్నివేశాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ మూవీ పేరు ‘డాన్ జాన్‘ (Don Jon) ఈ మూవీలో హీరో బూతు చిత్రాలకు అలవాటు పడి, ప్రేమకు దూరమవుతాడు. ఈ రొమాంటిక్ మూవీలో మసాలా సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
జాన్ ఒక పబ్బులో పనిచేస్తూ ఉంటాడు. జాన్ కు అతని బాడీ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అతనికి తన హౌస్ అంటే చాలా ఇష్టం. రోజూ జిమ్ చేస్తూ ఇంటిని తన చేతులతోనే శుభ్రపరుస్తాడు. అలా చేస్తేనే అతనికి హ్యాపీగా ఉంటుంది. మూడో విషయం అతనికి వ్యసనంగా మారుతుంది. ఇతడు బూతు చిత్రాలను చూస్తూ స్వయంతృప్తి పొందుతూ ఉంటాడు. దీనివల్ల అతనికి అమ్మాయిలతో ఏకాంతంగా గడిపినాగాని ఫీలింగ్ అంతగా కలగదు. ఆ తర్వాత మళ్లీ ఈ చిత్రాలను చూస్తూ స్వయంతృప్తి పొందుతాడు. రోజూ ఎవరినో ఒకరిని తన మాటలతో లోబరుచుకొని ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. ఆ తర్వాత చర్చికి వెళ్లి తను చేసిన తప్పులను దేవుడితో చెప్పుకొని క్షమించమని అడుగుతాడు. ఇలా ఇతని జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఒకరోజు పబ్ లోకి బార్బీ అనే ఒక అందమైన అమ్మాయి వస్తుంది. జాన్ చూపు ఆ అమ్మాయి పైనే ఉంటుంది. ఆమెతో మాటలు కలిపి ఏకాంతంగా గడపాలని చూస్తాడు. ఆమె మాత్రం సీరియస్ రిలేషన్ లోనే ఉందామని చెప్తుంది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం పెళ్లి చేసుకుందామనే వరకు వెళ్తుంది.
అయితే అతను ఆ చిత్రాలను చూస్తున్నప్పుడు బార్బీ డోర్ తెరిచి లోపలికి వస్తుంది. అతను బట్టలు లేకుండా, టీవీలో అటువంటి చిత్రాలు వస్తూ ఉండటంతో అతనిపై కోప్పడుతుంది. అతను ఆమెకు సారీ చెప్పి ఇంకెప్పుడు అలా చేయను అని చెప్తాడు. ఆ తర్వాత బార్బీ అతడు ఇంటికి శుభ్రం చేయడం మన పని కాదని అది హౌస్ కీపింగ్ వాళ్ళు చేస్తారని చెప్తుంది. అయితే అతి కష్టం మీద ఇంటికి శుభ్రం చేయనని ఒప్పుకుంటాడు. అయితే అతడు ఆ బూతు చిత్రాలను చూడటం మానుకోలేక పోతాడు. ఈ విషయం మళ్ళీ తెలుసుకున్న బార్బీ అతనితో బ్రేకప్ చెప్తుంది. చివరికి జాన్ బార్బీ ఒకటి అవుతారా? జాన్ ఆ చిత్రాలను చూడటం మానుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.