BigTV English

Allu Arjun: పుష్ప 2 సినిమాకు తప్పని తిప్పలు, మావల్ల కాదు బాబోయ్ అని తప్పుకుంటున్న ఎడిటర్స్

Allu Arjun: పుష్ప 2 సినిమాకు తప్పని తిప్పలు, మావల్ల కాదు బాబోయ్ అని తప్పుకుంటున్న ఎడిటర్స్

Allu Arjun: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు గురించి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను తీస్తున్నప్పుడు ప్రభాస్ కి అంత మార్కెట్ లేదు డెఫినెట్ గా ఈ సినిమా ప్లాప్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఈ సినిమాకి మొదట డిజాస్టర్ టాక్ వచ్చింది ఆ తర్వాత సినిమా మెల్లమెల్లగా పుంజుకుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది.


బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా తెలుగు సినిమా వైపు చాలామంది చూడటం మొదలుపెట్టారు. తెలుగు దర్శకులుకు కూడా మంచి గౌరవం ఇచ్చారు. తెలుగు సినిమాల కోసం వెయిట్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఇకపోతే తెలుగులో వస్తున్న బిగ్గెస్ట్ ఫిలిమ్స్ లో పుష్ప ఒకటి. ఇప్పటివరకు ఎదురుచూసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిపోయాయి. అయితే పుష్ప సినిమాను ఆగస్టు 15 న రిలీజ్ చేస్తారని అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాకి సంబంధించిన పాటలను కూడా హడావిడిగా రిలీజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మా వల్ల కాదు బాబోయ్


ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఫుటేజ్ దాదాపు నాలుగు గంటల డ్యురేషన్ వచ్చిందని సమాచారం వినిపిస్తుంది. నాలుగు గంటలు ఫుటేజ్ వచ్చినా కూడా సినిమా ఇంకా పూర్తి కాలేదు అని తెలుస్తుంది. ఇంకా 20% సినిమా పెండింగ్ దశలో ఉంది. ఈ సినిమాను ఎలా ఎడిట్ చేయాలో తెలియక ఎడిటర్స్ తలలు పట్టుకుంటున్నారట. ఈ తరుణంలో ఈ సినిమా ఎడిటింగ్ విభాగంలో చాలామంది ఎడిటర్స్ మారినట్టు విశ్వసినీయవర్గాల సమాచారం వినిపిస్తుంది. ఈ విషయంలోనే అల్లు అర్జున్, సుకుమార్ మధ్య కూడా భిన్న అభిప్రాయాలు వచ్చాయట. ఏదేమైనా ఈ సినిమా డిసెంబర్ 6న ఖచ్చితంగా రిలీజ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది.

ఈ సినిమా విషయంలోనే రూమర్లు

ప్రస్తుతం రాబోతున్న సినిమాలలో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి కారణం పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న సినిమాలలో ఈ సినిమా గురించి వచ్చినన్ని రూమర్లు ఏ సినిమా విషయంలోనూ రాలేదు, దర్శకుడికి హీరోకి మధ్య ఏదో జరిగిందని, అలానే సినిమా సంబంధించి వి ఎఫ్ ఎక్స్ వర్క్ అసలు బాగా కలిసి రావట్లేదని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఏదేమైనా గాని అల్లు అర్జున్ సుకుమార్ మధ్య ఉన్న బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మళ్లీ సినిమా హిట్ తోనే అందరికీ సమాధానం చెబుతారు అని ఫ్యాన్స్ తమ వెర్షన్ చెప్పుకుంటూ వస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×