BigTV English

Pushpa 2 : ‘పుష్పరాజ్’ కు బిగ్ షాక్.. అక్కడ డిజాస్టర్..?

Pushpa 2 : ‘పుష్పరాజ్’ కు బిగ్ షాక్.. అక్కడ డిజాస్టర్..?

Pushpa 2 : టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2.. డిసెంబర్లో థియేటర్లో ఏ సినిమా ఇప్పటికే సక్సెస్ఫుల్ రన్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఏ విధంగా ఓటీటీ లో కూడా భారీగా వ్యూస్ ను రాబట్టిన ఈ మూవీకి తాజాగా బిగ్ షాక్ తగిలిందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందో కాస్త వివరంగా తెలుసుకుందాం..


పుష్ప 2 కలెక్షన్స్..

అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప2.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా స్టోరీ కొనసాగిన విషయం తెలిసిందే. రెండు సినిమాలు నేషనల్ వైడ్ గా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. సీక్వెల్ గా వచ్చిన పార్ట్ టు పై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో మంచి హిట్ని సొంతం చేసుకుందనే చెప్పాలి. అంతేకాదు ఒకవైపు ఈ సినిమా రిలీజ్ టైం లో వివాదాలు కూడా ఏర్పడ్డాయి. ఇవేవీ సినిమా కలెక్షన్స్ పై ప్రభావాన్ని చూపలేదు. దాంతో సినిమా విడుదలైన తొలినాళ్లలోనే కోట్లు కొల్లగట్టింది. మొత్తానికి ఈ మూవీ 1800 కోట్లకు పైగా వసూలు చేసి బన్నీ ఖాతాలో మరో రికార్డు బ్రేక్ అయింది.


పుష్ప 2 ఓటీటీ రెస్పాన్స్..

ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. అలాగే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా భారీ వ్యూస్ని రాబట్టి మరో రికార్డ్ని బ్రేక్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.. థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఓటీటీలో కూడా మంచి టాక్ ను అందుకుంది. కానీ టీవీ లలోకి వచ్చేసరికి పెద్ద షాక్ తగిలిందని తెలుస్తుంది.

Also Read: ‘ సారంగపాణి జాతకం ‘ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్టా..?

టీవీలో పుష్ప 2 కు దారుణమైన రెస్పాన్స్.. 

ఈ మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 1000 కోట్లకు పైగా రాబట్టి అరుదైన రికార్డ్ని సొంతం చేస్తుంది. వరుసగా రికార్డులను బ్రేక్ చేసుకుంటూ నేషనల్ వైడ్ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమాకు టీవీలలో మాత్రం దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. గత టీఆర్పి రికార్డ్ లోని ఈ చిత్రం బ్రేక్ చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా ఒకటి డిజాస్టర్ టిఆర్పిని అందుకుంది చెప్పక తప్పదు. పుష్ప 2 కేవలం 12.62 టిఆర్పి రేటింగ్స్ మాత్రమే వచ్చింది. పుష్ప మూవీకి అయితే మంచి రెస్పాన్స్ దక్కింది. సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 టీవిలో డిజాస్టర్ అవ్వడం గమనార్హం..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ ఆట్లీ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×