BigTV English

Sarangapani Jathakam Twitter Review: ‘ సారంగపాణి జాతకం ‘ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్టా..?

Sarangapani Jathakam Twitter Review: ‘ సారంగపాణి జాతకం ‘ ట్విట్టర్ రివ్యూ.. మరో హిట్టా..?

Sarangapani Jathakam Twitter Review: టాలీవుడ్ హీరో ప్రియదర్శి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిన్నటి వరకు సినిమాల్లో కమెడియన్ గా నటించి గుర్తింపు పొందిన ఈయన బలగం సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా వెయిట్ ఉన్న పాత్రలనే చేస్తున్నాడు. రీసెంట్ గా కోర్టు మూవీలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆ సినిమా భారీ బిజీ అని సొంతం చేసుకోవడంతో హీరో ఖాతాలో మరో హిట్ సినిమా పడింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు. ఆ మూవీ పేరు సారంగపాణి జాతకం.. ఈ సినిమా ఇవాళ థియేటర్లోకి వచ్చేసింది. మరి సినిమా టాక్ ఎలా ఉందో? పబ్లిక్ సోషల్ మీడియా ద్వారా ఎలా రెస్పాండ్ అయ్యారో? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


ఈ సినిమా చాలా బాగుంది. కామెడీతో ఎంచక్కా నవ్వు కోవచ్చు. డైరెక్టర్ మంచి మూవీని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ మూవీ తప్పకుండ నచ్చుతుంది. మీరు కూడా మీ దగ్గరలోని థియేటర్లలోకి వెళ్లి సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి అని ఓ నెటిజన్ కామెంట్స్ చేశారు..

ఈ సినిమా కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. మొత్తానికి ఇది కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. మీరందరూ కూడా ఈ సినిమాను చూసి తప్పక ఎంజాయ్ చేయండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

 

వైజాగ్‌లో ప్రీమియర్ షో చూశాను. ఫస్టాఫ్ చాలా బాగుంది. తెర మీద వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉన్నాయి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సెకండాఫ్ కోసం ఆసక్తికరంగా వేచి చూస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సారంగపాణి జాతకం సినిమా చూస్తే తప్పకుండా వినోదాన్ని, ఎమోషన్స్ పంచుతుందనిపిస్తున్నది. విజయాలతో దూసుకెళ్తున్న ప్రియదర్శికి మరో విజయం ఖాయమనిపిస్తున్నది. ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్, రూపా కొడువాయూర్, వెన్నెల కిషోర్, హర్ష వైవాకు స్పెషల్ థ్యాంక్స్ అని హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

ఇంద్రగంటి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఆయన రూపొందించిన పాత్రలు సమాజంలో మనం చుట్టూ ఉండే పాత్రలకు దగ్గరగా ఉంటాయి.. జంధ్యాల వంటి దర్శకుల స్టైల్ లో సినిమాలు తీయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ల లోటుని ఈయన తీరుస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..

ఇక ఈ మూవీ విషయానికొస్తే.. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఈ చిత్రం ఉండబోతోందని అర్థం అవుతోంది. ప్రియదర్శితో పాటుగా ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, నరేష్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, వైవా హర్ష నటించారు.. ఇందులో ప్రియదర్శికి జోడిగా ప్రియా కొడవాయర్ హీరోయిన్ గా నటించింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు.. మొదటి షో తో పాజిటివ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం వసూలు చేస్తుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×