OTT Movie : కామెడీ జానర్లో ఏ సినిమా వచ్చినా సరే వదలకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే హారర్ సినిమాకి, కామెడీని జోడిస్తే రిజల్ట్ మరో లెవల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో తోడేలుగా మారుతాడు. పగలు మనిషిగా, రాత్రి తోడేలుగా భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఈ సినిమాకి కాస్త కామెడి కూడా జత చేశారు. చివరివరకు ఆసక్తికరంగా ఈ స్టోరీ సాగుతుంది. ఈ బాలీవుడ్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే….
జియో హాట్ స్టార్ (Jio hotstar)లో
ఈ కామెడీ హర్రర్ మూవీ పేరు ‘భేదియా’ (Bhediya). 2022 లో విడుదలైన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. మ్యాడ్‌డాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ దీనిని నిర్మించాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని అడవుల్లో ఈ స్టోరీ జరుగుతుంది. ఈ సినిమా ఆకారం మార్చే తోడేలు మనిషి గురించి, స్థానిక జానపద కథల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో వరుణ్ ధావన్, పాలిన్ కబాక్, దీపక్ డోబ్రియాల్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సచిన్-జిగర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అరుణాచల్ ప్రదేశ్‌లోని అడవిలో హైవే నిర్మించే ప్రాజెక్ట్ కోసం, భాస్కర్ అనే రోడ్ కాంట్రాక్టర్ అక్కడికి వస్తాడు. అతడు అడవిలో రహదారిని నిర్మించడం స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అక్కడి వారు అడవిని పవిత్రంగా కొలుస్తారు. ఒక రాత్రి ఒంటరిగా ఉన్నపుడు, భాస్కర్‌ను ఒక తోడేలు గాయపరుస్తుంది. దీనితో అతను పౌర్ణమి రాత్రుల్లో తోడేలుగా మారడం ప్రారంభిస్తాడు. ఇలా రాత్రుల్లో తోడేలుగా మారడం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోవడానికి, భాస్కర్ అతని స్నేహితులు ప్రయత్నిస్తారు. అతను తోడేలుగా మారినప్పుడు అడవిని నాశనం చేసే వారిని లక్ష్యంగా చేసుకుంటాడు. ఇలా జరుగుతుండగా మరొక తోడేలు ఈ స్టోరీలో ఎంట్రీ ఇస్తుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంటుంది.
ఈ విషయంలో ఒక వెటరనరీ డాక్టర్ అనికా, భాస్కర్‌కు సహాయం చేస్తుంది. భాస్కర్ తనలోని తోడేలుతో పోరాడాలా, అడవిని రక్షించాలా అనే సందిగ్ధంలో పడతాడు. చివరికి భాస్కర్ తోడేలుగా ఉండిపోతాడా ? అనికా ఇతనికి ఎలాంటి హెల్ప్ చేస్తుంది ? ఈ తోడేలు మర్మం వెనుక అసలు ఎవరు ఉన్నారు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కామెడీ హర్రర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా అడవుల నిర్మూలనకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తుంది. భాస్కర్ తన ప్రాజెక్ట్ ద్వారా అడవిని నాశనం చేయాలనుకుంటాడు. కానీ తోడేలుగా మారిన తర్వాత అడవి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాడు. ఇందులో తోడేలు ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకుంటాయి.
Read Also : మర్డర్ కేసులో అడ్డంగా ఇరికించే కేటుగాడు … సినిమా మొత్తం ట్విస్ట్ లే భయ్యా …