Nindu Noorella Saavasam Serial Today Episode: కొడైకెనాల్ పోలీస్ అమర్‌ను కలవడానికి వస్తాడు. రాథోడ్ లోపలికి తీసుకొచ్చి సార్ లోకల్ పోలీస్ వాళ్లు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్తాడు. ఓ కూర్చోండి అని అమర్ చెప్పగానే.. సరే అని పోలీస్ కూర్చుంటాడు. పోలీస్‌ను చూసిన మనోహరి మనసులో భయపడుతుంది. అమర్‌కు నిజం తెలిసిపోయిందా..? నన్ను అరెస్ట్ చేయడానికే పోలీస్‌ను తీసుకొచ్చారా..? అని ఏవేవో అనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ, అనామిక వస్తారు. ఏంటి మనోహరి గారు పోలీసులను చూసి అంతలా భయపడుతున్నారు అని అనామిక అడుగుతుంది. మిస్సమ్మ కూడా అంటే దొంగలు పోలీసులను చూసి భయపడతారు కదా అంటుంది.
దీంతో మనోహరి కోపంగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు. ఎవర్ని దొంగ అంటున్నావు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ అంటే నువ్వు అందరి మనుషులను దొంగ అంటావు కదా నిన్ను దొంగ అన్నాను అని చెప్తుంది. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. అనామిక, మిస్సమ్మ కలిసి ఆపేస్తారు. పోలీస్ తాను తీసుకొచ్చిన ఫైల్ అమర్‌కు ఇస్తూ.. ఇదిగోండి సార్ మేడం మర్డర్ సంబంధించిన ఫైల్ అని చెప్తాడు. ఫైల్ చూసిన అమర్ థాంక్యూ సోమచ్ ఆఫీసర్ బాబ్జీ గురించి ఏ లీడ్ దొరకలేదా ఇన్‌స్పెక్టర్. అని అడగ్గానే.. లేదు సార్ అసలు బాబ్జీ గురించి మాకేం తెలియదు. ఇంతకు ముందు ఉన్న ఇన్ష్పెక్టర్ కూడా పేపర్ వర్క్ ను నీట్‌గా ఫైల్ చేయలేదు సార్ అందుకే ఆ డీటెయిల్స్ తో బాబ్జీని పట్టుకోవడం చాలా కష్టం అయింది అని చెప్తాడు. దీంతో అమర్ మా గురించి వాళ్లకు అన్ని తెలుసు.. కానీ వాళ్ల గురించి మాకు ఏమీ తెలియదు. ఇదే వాళ్ల బలం ఆఫీసర్ దాంతోనే వాళ్లు ఆట ఆడుతున్నారు అంటాడు.
ఇంతలో పోలీస్ సార్ ఆ రోజు మీ ఇంట్లో వాళ్లు కాకుండా మేడం వాళ్ల ఫ్రెండ్ ఎవరో మీతో ఉన్నారని స్టేట్‌మెంట్ లో ఉంది. అని అడగ్గానే.. అమర్ మనోహరిని చూపిస్తూ తనే మనోహరి అని చెప్తాడు. దీంతో పోలీస్ మీరు పర్మిషన్ ఇస్తే.. ఆమెను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా అంటాడు. అడగండి అని అమర్ చెప్పగానే పోలీస్ మనోహరి దగ్గరకు వెళ్లి మీరు కొడైకనాల్‌కు రెగ్యులర్‌గా వస్తుండేవారా..? అని అడుగుతాడు. మనోహరి లేదని చెప్తుంది. మరి అప్పుడే ఎందుకు వచ్చారు అని పోలీస్ అడగ్గానే.. ఆరు వాళ్ల యానివర్సరీ ఉందని ఆరు ఫోన్ చేస్తే పార్టీ చేసుకుందామని వచ్చాను అని చెప్తుంది మనోహరి. దీంతో పోలీస్ ఆరోజు సార్ వాళ్లు గుడికి వెళ్లేటప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా మరి మీరెందుకు గుడికి వెళ్లలేదు అని అడగ్గానే.. అంటే వాళ్ల యానివర్సరీ కదా సరదాగా గుడికి వెళ్తేంటే.. వాళ్ల మధ్యలో నేనెందుకు అని వెళ్లలేదు అని మనోహరి చెప్తుంది. దీంతో పోలీస్ ఓ ప్రైవసీ కోసం అన్నమాట.
మేడం చనిపోయారని న్యూస్ వచ్చిన్నపుడు మీరు ఎక్కడున్నారు. ఆ న్యూస్ మీకెలా తెలిసింది అని అడగ్గానే.. మనోహరి ఇంట్లో ఉన్నాను.. రాథోడ్ ఫోన్ చేసి చెప్పారు అంటుంది. మరి మీరెందుకు మీ స్టేట్‌మెంట్ కంప్లీట్ చేయలేదు.. ఆరోజు సగంలోనే ఏడుస్తూ వెళ్లిపోయారని రాసుంది అని పోలీస్ అడగ్గానే.. మనోహరి ఏడుస్తూ.. ఆరు నా ఫ్రెండ్ మాత్రమే కాదండి ఈ లోకంలో నాకంటూ ఉన్న ఫ్యామిలీ తను. కలిసు ఉన్నాం. కలిసి పెరిగాం. నవ్వుతూ వెళ్లిన అమ్మాయి ప్రాణాలతో లేదని ఫోన్ వస్తే నన్ను ఎలా ఒప్పుకోమంటారు..? గుండెలు పగిలేలా ఏడవకుండా ఎలా ఉండమంటారు..? అంటూ బాధపడుతుంది. దీంతో పోలీస్ ఓకే ఎమోషనల్ అవ్వకండి మీ బాధ గురించి నేను అర్థం చేసుకోగలను. కేసు గురించి ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని స్టేషన్‌కు పిలుస్తాము అని చెప్పగానే.. మనోహరి ఓకే సార్ అంటుంది.
ఇక పోలీస్ సార్ ఇక నేను వెళ్తాను అని చెప్పగానే.. అమర్ ఇంక రెండు రోజుల్లో ఆ బాబ్జీని పట్టుకోవాలి. పాత కేసుల్లో బాబ్జీ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో సర్చ్ చేయండి అని చెప్పగానే.. ఓకే సార్ ప్రతిదీ మీకు అప్‌డేట్ చేస్తాను. సార్ మీతో మాట్లాడాలి కొంచెం బయటకు వస్తారా..? అనగానే సరే అంటూ అమర్, పోలీస్ కలిసి బయటకు వెళ్లిపోతారు. మనోహరి కూడా వెళ్లిపోతుంటే అనామిక, మిస్సమ్మ చేతులు పట్టుకుని ఆపేస్తారు. అక్కా మా ఆయన స్పీడు చూస్తుంటే.. బాబ్జీని పట్టుకునేలా ఉన్నారు కదా అంటుంది మిస్సమ్మ. దీంతో అనామిక.. బాబ్జీ ఒక్కడినేనా.. వాడి వెనక ఉన్న గుంత నక్కని చీకటి నుంచి బయటకు తీసుకొచ్చే టైం వచ్చింది భాగీ అంటుంది.
మిస్సమ్మ కూడా నిజం ఆయనకు తెలిసే లోపు ఆయనకు దూరంగా పారిపోతే కనీసం ప్రాణాలతో అయినా మిగిలిపోతారు అంటుంది. అనామిక కూడా అదే నిజం ఆయనకు తెలిసే లోపు ఉంటే.. ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టరు అంటుంది. దీంతో మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఆరు ఫోన్ తీసుకుని మిస్సమ్మకు ఫోన్ చేస్తుంది అంజు. మిస్సమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఇంతలో అనామిక వచ్చి పిల్లుల ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. అంజు వెంటనే మా అమ్మ ఇప్పుడే వచ్చింది మాట్లాడండి అంటూ ఫోన్ అనామికకు ఇస్తుంది. మిస్సమ్మ హలో అక్కా అని పిలుస్తుంది. అనామిక కూడా హలో చెల్లి అంటుంది. మిస్సమ్మ ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?