Pushpa2 Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ పుష్ప 2.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఏడాది చివర్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టేలా కలెక్షన్స్ను కొల్లగొట్టింది.. కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్లకు పైగా వసూలు చేసి అరుదైన రికార్డును నమోదు చేసింది పుష్ప 2.. అదే జోరుతో దాదాపు నెల వరకు కలెక్షన్ల సునామి సృష్టించింది. సంక్రాంతి మూవీస్ దెబ్బకు పుష్పరాజు వెనక్కి తగ్గాడని వార్తలు ఈమధ్య వినిపిస్తున్నాయి అందుకు కారణం కూడా లేకపోలేదు. నెల తర్వాత పుష్ప 2 టికెట్లు ధరలు సగానికి తగ్గించిన కూడా జనాలు చూడటానికి రావడం లేదని ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పుష్ప 2 మూవీ..
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన పుష్ప మూవీ నేషనల్ వైడ్ గా మంచి టాప్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఆ మూవీకి సీక్వల్ గా పుష్ప 2 మూవీని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్.. యాక్షన్ కథాంశం తో వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. దాంతో మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ కా వద్ద కాసుల వర్షం కురిపించింది. వారం రోజుల్లో 1000 కోట్లను క్రాస్ చేసిన ఈ మూవీ నెల లోపల 1800 కోట్లకు చేరుకుంది. ఇక 2000 కోట్లు క్రాస్ చేయడం పక్క అని మేకర్స్ అభిప్రాయపడ్డారు. కానీ వాళ్ళ ఆశలు అడియాసలు అయినట్లు తెలుస్తుంది. పుష్ప 2 మూవీ కేవలం 1800 కోట్ల దగ్గరే ఆగిపోయింది..
టిక్కెట్స్ తగ్గినా.. నో యూజ్..
పుష్ప రాజ్ జోరు కొద్దిరోజుల వరకే కొనసాగింది. సంక్రాంతి తర్వాత పుష్పాకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. బాహుబలి 2 రికార్డులను అయితే క్రాష్ చేసింది కానీ దంగల్ రికార్డులను చేరుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.. మేకర్స్ ఎంతగా 2000 కోట్లకు చేరుకోవాలని ఆశపడుతున్న ఆ ఆశ కలగానే మిగిలిపోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు 20 నిమిషాలు ఎక్స్ట్రా గా యాడ్ చేశారు అలాగే టికెట్ల రేట్లు తగ్గించారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు మాత్రమే పుష్ప 2 టికెట్ ధర ఉంది.. కానీ పుష్ప పుష్ప వైపు మాత్రం ఎవ్వరు చూడట్లేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతి కోస్తున్నాం సినిమాకు మాత్రమే జనాలు ముగ్గు చూపుతున్నారు. దాంతో పుష్ప2 రెండువేల కోట్లు రాబడుతుందని కలగానే మిగిలిపోయేలా ఉంది.. మరి అదృష్టం ఏదైనా కలిసి వచ్చి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందేమో చూడాలి..
అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాను ఎప్పుడూ సెట్స్ మీదకు తీసుకెళ్తారో చూడాలి..