Sobhita Dhulipala-Naga Chaitanya wedding : అక్కినేని వారసుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల (Sobhita-Chaitanya wedding) మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ జంట పెళ్లికి హాజరు కాబోతున్న సెలబ్రిటీలు ఎవరు అనే విషయంపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. నిజానికి పెళ్ళి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగబోతుందని ఇప్పటికే నాగర్జున వెల్లడించారు. అయినప్పటికీ టాలీవుడ్లో స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉండడంతో అక్కినేని ఫ్యామిలీ ఈ పెళ్లికి ఇన్వైట్ చేయబోతున్న సెలబ్రిటీలు ఎవరెవరు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చై-శోభిత పెళ్లికి హాజరు కాబోతున్న ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిసిపోయింది.
శోభిత ధూళిపాళ్ల – నాగచైతన్య (Sobhita-Chaitanya wedding) డిసెంబర్ 4న హైదరాబాద్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లిలో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పాన్ ఇండియా స్టార్లు కూడా సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. గెస్ట్ ల లిస్ట్ లో ప్రభాస్ (Prabhas), రాజమౌళి (Rajamouli)తో పాటు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఉన్నారనేది తాజా సమాచారం. అల్లు అర్జున్ మాత్రమే కాదు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నాగచైతన్య – శోభిత (Sobhita-Chaitanya wedding) పెళ్లికి హాజరు కాబోతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక డిసెంబర్ 5న అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ తెరపైకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే వీరంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే, పక్కా జాతర సీన్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఓవైపు అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ అంటూ ‘పుష్ప 2’తో జాతర చూపిస్తుంటే, మరోవైపు గాజులమ్మ జాతర అంటూ ‘తండేల్’ సినిమాతో నాగచైతన్య పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, ఇప్పుడు ‘తండేల్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న నాగ చైతన్య ఇద్దరు కలిసి కనిపిస్తే, పైగా వీరిద్దరికీ తోడు రాజమౌళి, ప్రభాస్ వంటి సెలబ్రిటీలు చేరడం అంటే అది జాతరే అవుతుంది కదా. ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ లో మరింత జోష్ పెరిగింది.
ఇదిలా ఉండగా నాగ చైతన్య, శోభిత (Sobhita-Chaitanya wedding) 2022 నుంచి డేటింగ్ లో ఉన్నారు. ఆగస్టులో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రీసెంట్ గా ఈ జంటకు సంబంధించిన పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. శోభిత – నాగ చైతన్యకు మంగళ స్నానాలు చేయించి, హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత శోభితను పెళ్లికూతురును చేసిన పిక్స్ కూడా నెట్టింట్లో సందడి చేశాయి. ఇక డిసెంబర్ 4న గ్రాండ్ గా జరగబోయే వీరి పెళ్లి గురించి ఇటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు, అటు శోభిత అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్, ప్రభాస్, రాజమౌలితో పాటు ఈ జంటను ఆశీర్వదించడానికి రాబోయే సెలబ్రిటీల లిస్ట్ లో ఇంకా ఎవరెవరున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.