Case on Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ ఇప్పటికే ఎన్నో ఇబ్బందులను దాటుకుంటూ ఫైనల్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. అయినా కూడా ఇప్పటికీ ఈ మూవీకి కష్టాలు తప్పినట్టుగానే అనిపించడం లేదు. ఒకటి తర్వాత మరొకటిగా ఇబ్బందులను దాటుకుంటూ వెళ్తోంది ‘పుష్ప 2’ (Pushpa 2). ఇటీవల టికెట్ రేట్ల విషయంపై హైకోర్టులో పిటీష్ దాఖలయ్యింది. అక్కడి నుండి ఈ సినిమాకు లీగల్ కష్టాలు మొదలయ్యాయి. తాజాగా ‘పుష్ప 2’పై ఒక రిట్ పిటీషన్ దాఖలయ్యింది. దీంతో మరోసారి ఈ సినిమాకు ఇబ్బందులు తప్పవు అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆ ఇబ్బంది నుండి ఈ మూవీ ఈజీగానే తప్పించుకుంది.
చివరికి ఎదురుదెబ్బ
‘పుష్ప’ అనే సినిమా అడవిలో గంధపు చెక్కల స్మగ్లింగ్ స్టోరీతో తెరకెక్కింది. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా దానికి సీక్వెల్‌గా అదే కథను కొనసాగించనుంది. అంటే ఈ మూవీలో హీరోనే ఒక స్మగ్లర్. తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి హీరో ఏం చేస్తాడు అనేదే మూవీ కథ. అయితే ఈ సినిమాలో సమాజ హితం లేదని, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా ఉందని శ్రీశైలం అనే వ్యక్తి ‘పుష్ఫ 2’పై ఒక రిట్ పిటీషన్ వేశారు. ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్‌గానే ఉన్నా.. హైకోర్టుకు మాత్రం ఇది పిటీషన్ వేసేంత పెద్ద మ్యాటర్ అని అనిపించలేదు. అందుకే ఈ రిట్ పిటీషన్ వేసిన వ్యక్తికే దీనివల్ల ఎదురుదెబ్బ తగిలింది. ‘పుష్ప 2’ సేఫ్ అయ్యింది.
Also Read: పుష్పగాడి రూల్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే.. మేకింగ్ వీడియోతోనే హైప్ ఎక్కిస్తున్న టీమ్
లక్ష జరిమానా
‘పుష్ప 2’పై వేసిన రిట్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అంతే కాకుండా కోర్టు సమయాన్ని వృధా చేయవద్దంటూ రిట్ పిటీషన్ దాఖలు చేసిన శ్రీశైలంకు రూ.1 లక్ష జరిమానా విధించింది. దీంతో ‘పుష్ప 2’ మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే టికెట్ ధరల విషయంలో ఈ మూవీపై ఒక పిటీషన్ దాఖలయ్యింది. కానీ అందులో నుండి కూడా తృటిలో తప్పించుకున్నారు. కానీ ఎంతైనా ‘పుష్ప 2’ టికెట్ ధరల విషయంలో ప్రేక్షకులు కాస్త నెగిటివ్ అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. మరీ అలా రేట్లు పెంచేస్తే సినిమాను థియేటర్లలో చూడాలని ఉన్నా చూడలేదని, ఓటీటీలో వచ్చేవరకు ఆగుతారని అంటున్నారు. అయినా కూడా ఈ టికెట్ ధరల విషయంలో ఆడియన్స్ ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేశారు.
అందరిలో ఆసక్తి
‘పుష్ప 2’పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మూవీ టీమ్ కూడా ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలోనే ఈ సినిమా ఎన్నో రికార్డులు సాధిస్తుందని బన్నీ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. విడుదలకు ఇంకా కొన్నిరోజులే ఉన్నా మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. దీంతో ‘పుష్ప 2’ రిజల్ట్ ఎలా ఉంటుందో అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది.