Allu Arjun Sandhya Theatre: కృష్ణుడిని ఎవ్వరు చూశారు మన కళ్ళకు చూపింది ఈ సినిమా,స్వర్గమును ఎవ్వడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా. చాలామంది తెలుగు వాళ్ళకు కృష్ణుడు ఎలా ఉంటారు.? అంటే అన్నగారు ఎన్టీ రామారావు లా ఉంటారు అని చెబుతుంటారు. అంటే సినిమా మనిషిని కూడా దేవుడిని చేయగలదు. అలానే ఒక సినిమా హీరో, ప్రేక్షకులను కూడా దేవుళ్లను చేస్తాడు. అందుకే చాలా సందర్భాలలో సీనియర్ హీరోలంతా ప్రేక్షక దేవుళ్ళు అని పిలుస్తూ ఉండేవారు. ఈరోజుల్లో ప్రేక్షకులను ట్రీట్ చేసే విధానం పూర్తిగా మారిపోయింది. కానీ ఒకప్పుడు ప్రేక్షకులను ట్రీట్ చేసే విధానం వేరు. తెలుగు వాళ్ళు ఒక హీరోని నిజంగా దేవుళ్ళ లానే కొలుస్తారు. పెద్ద పెద్ద బ్యానర్లు కడతారు, పాలాభిషేకాలు చేస్తారు, రక్త తిలకం దిద్దుతారు. దాదాపు దేవుడికి చేసే పనులనే తమ అభిమాన హీరోలు కూడా చేస్తారు.దీనిని నిరూపించడానికి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
ఇక రీసెంట్ టైమ్స్ లో కూడా చాలామంది అభిమానులు తమ హీరోలను కూడా ఎంతలా ఆరాధిస్తారో, ఆదరిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లను చూస్తూనే పెరుగుతారు. చిన్నపిల్లలను కూడా సినిమా ప్రభావితం చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ మధ్య కాలంలో పుష్ప సినిమా చూడడానికి వచ్చిన ఒక కుటుంబ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. రేవతి అనే ఒక మహిళా తన కుటుంబంతో పాటు పుష్ప 2 సినిమా చూడటానికి వచ్చింది. హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు సినిమాను చూడడానికి సంధ్య థియేటర్ కి వచ్చాడు. అల్లు అర్జున్ రావడంతో కేవలం టికెట్ తీసుకున్న ప్రేక్షకులు మాత్రమే కాకుండా అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఒక్కసారిగా అంతమంది రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట లో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. తన కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నాడు.
శ్రీ తేజ్ అల్లు అర్జున్ కి ఎంత పెద్ద అభిమానో తన తండ్రి చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. సినిమా కోసం దాదాపు మూడు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాడు అంటూ తెలిపాడు. అంతేకాకుండా తన వీధిలో వాళ్ళంతా కూడా శ్రీ తేజ్ ను పుష్ప అని పిలుస్తారట. తన అభిమాన హీరో ప్రీమియర్ షో కి తన కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకెళ్లాడు అంటే అల్లు అర్జున్ ను ఏ స్థాయిలో శ్రీతేజ్ అభిమానించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అనుకోని విధంగా జరిగిన సంఘటన వలన ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు. ఒకవైపు తన అభిమాన హీరో నటించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. మనకు బాగా ఇష్టమైన హీరో సినిమా సక్సెస్ అయితే ఆ ఆనందం వర్ణనాతీతం. ఇప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించే స్థితిలో శ్రీ తేజ్ లేడు. సినిమా బ్రతికింది, శ్రీ తేజ్ కూడా బ్రతికితే ఆ చిత్ర యూనిట్ కు కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. ఇక ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకూడదు అంటే హీరోలే తమ అభిమానులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి.
Also Read : Zakir Hussain: జాకీర్ హుస్సేన్ ఒక్కో కచేరీకి ఎంత తీసుకుంటారు.. వాహ్ తాజ్ రెమ్యునరేషన్ ఎంత?