BigTV English

Tollywood Couples : లవ్ & అరేంజ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన స్టార్స్ వీరే..

Tollywood Couples : లవ్ & అరేంజ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన స్టార్స్ వీరే..

Tollywood Couples : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి కామన్.. ఏ హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారో పెళ్లి చేసుకుంటున్నాం అని అంటారో చెప్పడం కాస్త కష్టమే.. అయినా ఈ మధ్య ఎక్కువ మంది సెలెబ్రేటీ జంటలు ప్రేమ వివాహన్ని చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న వీళ్ళు మనస్పర్థలు రావడంతో సడెన్ గా విడాకులు ప్రకటిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన సెలబ్రేటీలు ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాదారణం.. చాలా మంది హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు. నటీనటులు కూడా ప్రేమలో పడుతున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు రిలేషన్లో ఉంటున్నారు. ఇక పెళ్లి వరకు తమ ప్రేమను తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.. ఇక పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటలు ఎక్కేలా చేస్తున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు వస్తాయో తెలియదు కానీ విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇస్తారు. ఇలా సినీ ఇండస్ట్రీలో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐదు తెలుగు సెలెబ్రేటీ జంటలు ఎవరో చూద్దాం..

పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్..


టాలీవుడ్ హీరో అప్పటికే ఒక పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2009 జనవరిలో రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 2012లో రేణుదేశాయ్‌కు కూడా విడాకులు ఇచ్చారు. 2013 నవంబర్ లో రష్యాకు చెందిన అన్నా లెజినివాను మూడవ వివాహం చేసుకున్నారు..

సుమంత్ – కీర్తి రెడ్డి.. 

అక్కినేని కుటుంబానికే చెందిన మరో హీరో సుమంత్ కూడా తొలిప్రేమ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి 2004 లో వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జంట కూడా 2006లో విడాకులు తీసుకుని వివాహబంధానికి ముగింపు చెప్పారు. ఆ తర్వాత సుమంత్ మాత్రం పెళ్లి చేసుకోలేదు కానీ కీర్తిరెడ్డి మాత్రం వేరొకరిని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యింది.

సిద్దార్థ్ – మేఘన.. 

హీరో సిద్దార్థ్ మేఘనను ప్రేమించి 2003లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడివిడిగా జీవితం ప్రారంభించి 2007లో విడాకులు తీసుకున్నారు ఈ జంట. సిద్దార్థ్ రీసెంట్ గా అతిధిరావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు.

సమంత – నాగచైతన్య.. 

ఏ మాయ చేసావే చిత్రంలో నటించిన నాగచైతన్య, సమంత పరిచయం ప్రేమగా మారి 2017 అక్టోబర్ లో ఇరు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. సమంత, చైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకుని వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళ ను పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య.. సమంత మాత్రం సింగిల్ గానే ఉన్నాడు.

వీరే కాదు డైరెక్టర్ రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి రచయిత్రి స్క్రీన్ రైటర్ అయిన కనికా ధిల్లాన్‌ ను ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నాడు. 2017లో ప్రకాశ్‌కు విడాకులు ఇచ్చి 2021లో హిమాన్షు శర్మను పెళ్లాడింది. ఆయన మరొకరిని పెళ్లి చేసుకున్నారు.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×