BigTV English

Allu Arjun : దారిలోకి వచ్చిన బన్నీ… చిరు మావయ్యే నాకు అన్నీ అంటూ… స్టేజ్ పైనే….

Allu Arjun : దారిలోకి వచ్చిన బన్నీ… చిరు మావయ్యే నాకు అన్నీ అంటూ… స్టేజ్ పైనే….

Allu Arjun : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. నటుడుగా కొన్ని సినిమాలు చేసినా కూడా గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా చూడడానికి బాగానే ఉన్నా కూడా ఎక్కువ పేరు రాఘవేంద్రరావుకి వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్. ఇక్కడితో స్టార్ హీరో అయిపోయాడు అల్లు అర్జున్. తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఏర్పడింది ఇక్కడే. ఆ తర్వాత అద్భుతమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అలా స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిన విషయమే.


మెగాస్టార్ అంటే అభిమానం

అల్లు అర్జున్ కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టమో అని వాళ్ళ సందర్భాల్లో మాటల్లో తెలిపాడు. అప్పట్లో స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన సందర్భాలే ఉండేవి. రీసెంట్ టైమ్స్ లో నా ఫ్యాన్స్ ఆర్మీ అంటూ అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు నాకు హీరో అంటే చిరంజీవి గారే. చిరంజీవి గారి ఇంద్ర సినిమా వలన నేను 17 వేలు రూపాయలు నష్టపోయాను అంటూ అప్పట్లో అల్లు అర్జున్ చెప్పిన మాటలు కూడా వైరల్ గా మారాయి. సరైనోడు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కు కొద్దిపాటి బేధాభిప్రాయాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతి సందర్భంలో చిరంజీవిని ఇంకా ఎక్కువగా పొగుడుతూ మాట్లాడారు. ఇక రీసెంట్ గా మరోసారి మెగాస్టార్ చిరంజీవి గురించి తన మాటల్లో తెలిపాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఇష్యూ లో చిరంజీవి ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయి బన్నీ ను సేవ్ చేశారు అనేది తెలుగు మీడియా కథలుగా రాసింది.


మెగాస్టార్ నాకు స్ఫూర్తి

మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి అని అల్లు అర్జున్ అన్నారు. నిన్న ముంబైలో జరిగిన ‘వేవ్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మామయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పారు. మానసిక ప్రశాంతతే తన ఫిటెనెస్ కు కారణమని తెలిపారు. నటుడిగా తన జర్నీలో ఎన్నో సవాళ్లను అధిగమించినట్లు చెప్పుకొచ్చారు. చిన్నతనం నుంచే తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ చేస్తూ కనిపించిన సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read : Vijayashanthi : ఆ షో పై నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×