Vijayashanthi : ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ అంటే చాలామంది హీరోయిన్స్ గుర్తుకు వస్తారు అది సహజం. కానీ ఒకప్పుడు లేడీస్ సూపర్ స్టార్ అంటే విజయశాంతి మాత్రమే. ఎన్నో సినిమాల్లో నటిగా నటించిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆమె కెరియర్ లో కర్తవ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అందరికీ తెలిసిన విషయమే. అక్కడితోనే ఆమెకి లేడీ సూపర్ స్టార్ అని బిరుదు కూడా వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలు విజయశాంతిని నెక్స్ట్ లెవెల్లో నిల్చబెట్టాయి. కొన్ని రోజుల తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి విజయశాంతి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. పాలిటిక్స్ లో విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నట్లు విజయశాంతికు కూడా ఇలాంటివి చాలా ఎదురయ్యాయి. అని కూడా చాలామందికి విమర్శలు సంధించారు.
ఆ షో పై ఇంట్రెస్ట్ లేదు
బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ షో తర్వాత బాలకృష్ణను చాలా మంది ప్రేక్షకులు చూసిన విధానం కంప్లీట్ గా మారిపోయింది. అంతకుముందు బాలకృష్ణ మీద విపరీతమైన నెగెటివిటీ ఉండేది. ఆడియన్స్ ని కొడతాడు, స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడుతాడో తెలియదు అంటూ రకరకాల వార్తలు వినిపించేవి. ఈ షో మొదలైన తర్వాత మిగతా హీరోలతో బాలకృష్ణకి ఎటువంటి బాండింగ్ ఉంది. యంగ్ హీరోస్ తో ఎలా కలిసి ఉంటారు అని చాలామందికి అర్థం అయింది. అయితే ఈ షో కి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా గెస్ట్ గా హాజరయ్యారు. దీనిని ఉద్దేశిస్తూ మీరు ఎప్పుడు ఎందుకు గెస్ట్ గా వెళ్ళలేదు అని విజయశాంతిని అడిగారు ప్రముఖ జర్నలిస్ట్. దీనికి విజయశాంతి మాట్లాడుతూ వాళ్లు వాళ్లు చుట్టాలు ఎక్కడికైనా వెళ్తారు. నాకు అటువంటి షో పైన అసలు ఇంట్రెస్ట్ లేదు. గతంలో కూడా నాకు చాలా వచ్చిన నేను వెళ్లలేదు అని చెప్పుకొచ్చారు.
సరిలేరు రీ ఎంట్రీ
ఇక విజయశాంతి విషయానికి వస్తే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ ని కూడా బాగా డిజైన్ చేశాడు అనిల్. ఇక రీసెంట్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే సినిమాలు మరోసారి కనిపించారు విజయశాంతి. ఒకవైపు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండడంతో పాటు మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు.
Also Read : Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. అలా అనేసారేంటి?