BigTV English

Pushpa 2 : డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్

Pushpa 2 : డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్

Pushpa 2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాలోనే కాకుండా మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా మారారు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన మూడు సినిమాల్లో రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ గా ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీని కారణం ఆ సినిమా టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండటం. సినిమా టికెట్ రేట్లు గత ప్రభుత్వంలో చాలా తక్కువగా ఉండేవి. అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా అప్పటి సీఎంను కలిసి మంతనాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఇక ప్రస్తుతం డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా టికెట్ రేట్ల విషయమై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, శ్రీ పవన్ కళ్యాణ్ ను కలిసింది చిత్ర యూనిట్. అయితే చిత్ర యూనిట్ అడిగినట్లు టికెట్ హైక్ అనుమతించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సినిమా ప్రీమియర్స్ కి 950 రూపాయలు టికెట్ కాస్ట్ పెట్టారు. మల్టీప్లెక్స్ లో ఈ సినిమా టికెట్ కాస్ట్ 377 రూపాయలు. సింగిల్ స్కిన్ థియేటర్స్ లో 295 రూపాయలు నుంచి 300 వరకు ఈ సినిమా టికెట్ కాస్ట్ ఉండనుంది. ఇకపోతే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు అల్లు అర్జున్ ట్విట్టర్ వేదిక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ను మెన్షన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు అంటూ తెలియజేశాడు అల్లు అర్జున్.

Also Read :


ఇకపోతే అల్లు అర్జున్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ కి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పడంతో ఆ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై కొంతమంది పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారు. మరి కొంతమంది మాత్రం కేవలం అవసరం కోసమే అల్లు అర్జున్ ఇలా ట్వీట్స్ వేస్తున్నాడు అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పాజిటివ్ టాక్ ఆల్రెడీ మొదలైపోయింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంత సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×