BigTV English
Advertisement

Pushpa 2 Pre Release Event: తన స్పీచ్‌తో తండ్రికే షాకిచ్చిన అల్లు అయాన్

Pushpa 2 Pre Release Event: తన స్పీచ్‌తో తండ్రికే షాకిచ్చిన అల్లు అయాన్

Pushpa 2 Pre Release Event: అల్లు ఫ్యామిలీలో అందరికీ సోషల్ మీడియాలో సెపరేట్ ఫ్యాన్ బ్యాసే ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ వారసుడు అల్లు అయాన్‌కు ఇప్పటికే సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయాడు. అయాన్ ఏం చేసినా మీమ్స్, రీల్స్ ట్రెండ్ అవ్వడం ఖాయం. అలాగే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా స్పెషల్‌గా ఎంట్రీ ఇచ్చాడు అయాన్. తన చెల్లెలు అర్హతో కలిసి అయాన్ ఎంట్రీ మామూలుగా లేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో కూడా అయాన్, అర్హ వచ్చి ఇలాగే ఫ్యాన్స్‌ను అలరించగా.. ఈసారి మాత్రం అయాన్ స్పీచ్ ఏకంగా తన తండ్రి అల్లు అర్జున్‌ను షాక్‌కు గురిచేసింది.


షాక్‌లో బన్నీ

అల్లు అయాన్ ముందుగా స్టేజ్ ఎక్కగానే మైక్ అందుకొని ‘‘అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఒక మాట చెప్పాలి. మీ అందరికీ పుష్ప చాలా నచ్చుతుంది. ఇంకా తగ్గేదే లే’’ అంటూ అల్లు అర్జున్ మ్యానరిజంను ఇమిటేట్ చేసి చూపించాడు అయాన్. తను మాట్లాడుతున్నంతసేపు అల్లు అర్జున్ షాక్‌లోనే ఉన్నాడు. అంతే కాకుండా తగ్గేదే లే అన్నప్పుడు తను మరింత షాక్‌లోకి వెళ్లిపోయాడు. మొత్తానికి అయాన్ అంత స్పీచ్ ఇస్తాడని అల్లు అర్జున్ కూడా ఊహించలేదనుకుంటా. ఇక అర్హ మాత్రం తాను ఎలాంటి స్పీచ్ ఇవ్వాలని అనుకోవడం లేదని స్టేజ్ దిగి వెళ్లిపోవాలనుకుంది. కానీ చివర్లో తాను కూడా ఒక తెలుగు పద్యం చెప్పి అందరికీ షాకిచ్చింది.


Also Read: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ ఫైట్.. కాలర్స్ పట్టుకొని..

దగ్గరకు తీసుకున్నాడు

అందరికీ హాయ్ అని మాత్రమే చెప్పి వెళ్లిపోవాలనుకుంది అర్హ. కానీ అర్హ చెప్తున్న తెలుగు పద్యాలు, శ్లోకాలు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో దాని గురించి ప్రస్తావించారు సుమ. దీంతో తను ఒక తెలుగు పదం చెప్పింది. అది విన్న తర్వాత కూడా అల్లు అర్జున్ షాకయ్యాడు. అంతే కాకుండా స్టేజ్ దిగిన వెంటనే అయాన్, అర్హను దగ్గరకు తీసుకున్నాడు. మొత్తానికి ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్నో హైలెట్స్ ఉండగా అందులో అయాన్, అర్హ స్పీచ్ కూడా ఒక మేజర్ హైలెట్‌గా నిలిచింది. అంతే కాకుండా ఈ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్క గెస్ట్ కూడా ‘పుష్ప 2’పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మూవీ పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు.

అందరికీ ఒకే నమ్మకం

‘పుష్ప 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అంతే కాకుండా యంగ్ డైరెక్టర్స్ వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అందులో ప్రతీ ఒక్కరు ‘పుష్ప 2’ గురించి స్పెషల్‌గా మాట్లాడేది ఏమీ లేదని, ఈ మూవీ గురించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు తెలుసు అని అన్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్‌ను చూసిన రాజమౌళి.. కచ్చితంగా ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు. కానీ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రావడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×