Rashmika Mandanna : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఛలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. అయితే తన కెరియర్ లో స్టార్ హీరోలు సరసన సినిమాలు చేసి అద్భుతమైన హిట్స్ అందుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా తన టాలెంట్ చూపించింది రష్మిక. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రల్లో కంటే కూడా అనిమల్ సినిమాలో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది.
ఈ తరుణంలో ఈ సినిమా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో రష్మిక చాలా విషయాలు స్టేజ్ పై ఓపెన్ గా మాట్లాడింది. ఈ ప్రాజెక్టును తను ఎంత ఇష్టపడి చేసిందో మాటల్లో ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా సినిమా గురించి మాట్లాడుతూ టెక్నీషియన్స్ అందరికీ థాంక్యు అంటూ పేరుపేరునా చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ఎంత పెద్ద ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవి శ్రీ ప్రసాద్ ని ఉద్దేశిస్తూ ఐ లవ్ యు అంటూ స్టేజ్ పైనుంచి చెప్పింది రష్మిక. దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ సినిమాకి ఏ స్థాయిలో సంగీతం అందిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు సుకుమార్ కూడా మరో సంగీత దర్శకుడు తో పని చేయకపోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పాలి.
Also Read : Pushpa 2 : డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
పుష్ప సినిమాపై అందరూ మంచి నమ్మకంతో ఉన్నారు. రష్మిక మాట్లాడుతున్నంత సేపు స్పీచ్ అప్పుడే అవ్వదు అరే ఉండరా బాబు అంటూ ఆడియన్స్ కి చెబుతూ వచ్చింది. ఇంకా ఉంది అయిపోలేదు అంటూ రష్మిక మాట్లాడుతూనే ఉంది. సినిమా గురించి టెక్నీషియన్స్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో కనిపించింది రష్మిక. ఈ పాత్రకు కూడా సినిమాలో మంచి స్కోప్ ఉంది. రష్మిక మొదటిసారి ఈ రేంజ్ లో మాట్లాడింది. ఇక రష్మిక మాట్లాడిన మాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అభిమానులుకు కూడా లవ్ యు అని చెబుతూ మీరు నన్ను ప్రేమించిన ప్రేమించక పోయినా, నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక మాటల్లో అక్కడక్కడ తెలంగాణ స్లాంగ్ కూడా అద్భుతంగా కొట్టొచ్చినట్లు వినిపించింది.
Also Read : Rajamouli at Pushpa 2 movie pre release event : ఈ సినిమాకి ఆల్ ది కూడా చెప్పను