Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
శక్తిమాన్…
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ఈయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఓ పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయ్యారనే వార్తలు వచ్చాయి. అదే విధంగా ఇటీవల మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్(Basil Joseph) డైరెక్షన్లో కూడా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి మరొక బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జోసెఫ్ బన్నీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం సూపర్ హీరో శక్తిమాన్ (Shakthi Man) గా కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
రణవీర్ సింగ్..
ఇలా శక్తిమాన్ గా సరికొత్త కథతో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించాల్సి ఉండేది కాదని మొదటగా ఈ ప్రాజెక్టు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ (Ranvir Singh)వద్దకు వెళ్లడంతో కొన్ని కారణాల వల్ల రణవీర్ సింగ్ ఈ సినిమా కథను పక్కన పెట్టేసారని తెలుస్తోంది. అయితే కొంతకాలం వాయిదా తరువాత ఈ చిత్రాన్ని తిరిగి జోసఫ్ అల్లు అర్జున్ తో చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కథ విషయంలో సోని పిక్చర్స్ ఒక అడుగు ముందుకు వేయడంతో శక్తిమాన్ లాంటి మరొక సూపర్ హీరో కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టమవుతుంది.
#AlluArjun as SHAKTHI MAN ⚡
India’s most loved & iconic superhero is back – this time with Allu Arjun donning the cape! 🔥Initially offered to Ranveer Singh, the project was shelved for a while. Now, it’s back on track with Basil Joseph directing and Sony Pictures backing the… pic.twitter.com/1FToMi5qUs
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 13, 2025
ఈ సినిమాకు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచుకుంటున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత బన్నీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నారని ఆ సినిమా తరువాతనే జోసెఫ్ సినిమా రాబోతుందని సమాచారం. ఇక ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. నిన్నటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతుందని తెలుస్తోంది.