Laapataa Ladies: ఆస్కార్ అనే అవార్డ్ అందుకోవాలని అనేది దాదాపు ప్రతీ ఫిల్మ్ మేకర్ కల. అలాంటి ఆస్కార్‌ను ఇండియాకు తీసుకురావాలని కూడా చాలామంది ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించారు. ప్రతీ సంవత్సరం కొన్ని ఇండియన్ సినిమాలు ఆస్కార్ లిస్ట్‌లోకి చేరడం, చివరి వరకు వెళ్లకుండా వెనుదిరగడం కామన్ అయిపోయింది. అలాగే ఈ ఏడాది విడుదలయిన ఇండియన్ సినిమాల్లో హిందీ చిత్రమైన ‘లాపతా లేడీస్’ కూడా షార్ట్ లిస్ట్ అయ్యింది. కానీ ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి ఈ సినిమా పేరు లేదు. దీంతో మూవీ టీమ్ అంతా నిరాశలో ఉన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించారు కూడా. ‘లాపతా లేడీస్’ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు.
స్పెషల్ పోస్ట్
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies) చాలామంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఎంతోమందికి ఈ మూవీ ఫేవరెట్‌గా కూడా మారిపోయింది. అయితే ఈ సినిమా ఆస్కార్ చివరి లిస్ట్ వరకు క్వాలిఫై అవ్వకపోవడంపై మేకర్స్ నిరాశలో ఉన్నా వారికి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ)కు థాంక్యూ చెప్పింది. ఈ సినిమాను అంతర్జాతీయ ఆడియన్స్ వరకు తీసుకెళ్లడం కోసం ‘లాస్ట్ లేడీస్’ అనే టైటిల్‌తో ఇంగ్లీష్‌లో కూడా విడుదలయ్యింది. చాలామంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఈ మూవీ ఆస్కార్ లిస్ట్‌లో చేరకపోవడంపై స్పందిస్తూ మేకర్స్ పోస్ట్ షేర్ చేశారు.
Also Read: రష్మిక మందన్నకు వింత వ్యాధి.. వెలుగులోకి భయంకర నిజం..
మాకు గర్వకారణం
‘ఈ ఏడాది అకాడమీ అవార్డ్స్ షార్ట్ లిస్ట్‌లో లాపతా లేడీస్ స్థానం సంపాదించలేకపోయింది. దానివల్ల మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఈ ప్రయణంలో మాకు దొరికిన సపోర్ట్, నమ్మకాన్ని మేము ఎల్లప్పటికీ రుణపడి ఉంటాం. మా సినిమాను పరిగణనలోకి తీసుకున్నందుకు ఎఫ్ఎఫ్ఐ జ్యూరీకి అకాడమీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రతిష్టాత్మకమైన జర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప సినిమాల మధ్య మా సినిమాను కూడా జతచేయడం మాకు గర్వకారణం. మా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ, సపోర్ట్‌కు మనస్ఫూర్తిగా థాంక్యూ’ అని చెప్పుకొచ్చారు మేకర్స్.
అందరికీ కంగ్రాట్స్
ఆస్కార్ రేసు నుండి ‘లాపతా లేడీస్’ తప్పుకున్నా కూడా మరొక 15 సినిమాలు సెలక్ట్ అయ్యాయి. ఆ ఎంపికయిన సినిమాలకు ‘లాపతా లేడీస్’ మేకర్స్ కంగ్రాట్స్ తెలిపారు. ‘ఇది మాకు ముగింపు కాదు ఒక ముందడుగు మాత్రమే. మేము మరిన్ని బలమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ’ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ‘లాపతా లేడీస్’ ఆస్కార్ బరిలో షార్ట్ లిస్ట్ అవ్వలేనందుకు చాలామంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరు ప్రేక్షకులను ఎంతోకొంత ప్రభావితం చేశారు. అలాగే సినిమా కూడా ఒక ప్రభావితం చేసే కథతో తెరకెక్కి అందరినీ ఆకట్టుకుంటుంది.