BigTV English

Allu Arjun: మెగా మామ ఇంటికి బన్నీ.. గొడవలకు స్వస్తి..కానీ?

Allu Arjun: మెగా మామ ఇంటికి బన్నీ.. గొడవలకు స్వస్తి..కానీ?

Allu Arjun.. ఎట్టకేలకు అల్లు అర్జున్ (Allu Arjun)మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ఇంటికి భోజనానికి వెళ్లడంతో అటు మెగా ఇటు అల్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి లంచ్ కి వెళ్లడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇంటికి వెళ్లిన అల్లుడిని సతీసమేతంగా ఆహ్వానించిన చిరంజీవి, సురేఖ దంపతులు బన్నీ ఇంటికి రాగానే ఎలా ఉన్నావ్ అంటూ పరామర్శించారు. ప్రస్తుతం వీరంతా హ్యాపీగా ఒకే చోట చేరి, అసలు ఈ అరెస్టుకు గల కారణాలను మామ అల్లుళ్లు చర్చించుకున్నట్లు సమాచారం.


మెగా – అల్లు గొడవలకు స్వస్తి..

ఇకపోతే గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ మెగా కుటుంబానికి సంబంధించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ పై పూర్తిస్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందిన పుష్ప -2 సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కడా కూడా అల్లు అర్జున్ మెగా హీరోల గురించి మాట్లాడకపోవడంతో అందరూ విశ్వాసఘాతకుడు అనే అపవాద కూడా బన్నీపై మోపారు. అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి రుణపడి ఉంటాడని, ఆ కుటుంబం వల్లే ఈ స్థాయికి వచ్చినా..ఇప్పుడు చెప్పుకోవడం లేదనే కామెంట్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేయడంతో గొడవలకు కాస్త స్వస్తి పలికారని చెప్పవచ్చు.


పవన్ కళ్యాణ్ దూరం అయినట్టేనా..

ఇకపోతే పుష్ప2 బెనిఫిట్ షో కారణంగా సంధ్యా థియేటర్ వద్ద నిర్వహించిన ర్యాలీలో భాగంగా అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. అందులో భాగంగానే డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను అరెస్టు చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో అల్లు అర్జున్ ను చంచల్గూడా జైలుకి తరలించారు. అయితే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైదరాబాద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా నాలుగు వారాలపాటు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయినా సరే పోలీసుల నిర్లక్ష్యమో లేక వీరి వెనుక ఉండి ఎవరైనా నడిపిస్తున్నారో తెలియదు కానీ 13వ తేదీ సాయంత్రమే బెయిల్ మంజూరు అయినా చంచల్గూడా పోలీసులు మాత్రం రాత్రంతా అల్లు అర్జున్ ని జైల్లో ఉంచారు. డిసెంబర్ 14 ఉదయం ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించడానికి టాలీవుడ్ హీరోలంతా క్యూ కట్టారు. మరొకవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియడంతో చిరంజీవి తాను నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని భార్యతో సహా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. ఇక నిన్న కూడా సురేఖ అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అల్లుడిని పరామర్శించింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాత్రి హైదరాబాద్ కి చేరుకోవడంతో ఈరోజు ఉదయం అల్లు అర్జున్ ని పరామర్శిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వెళ్లకుండా విజయవాడకు వెళ్ళిపోయారు. అక్కడ జరిగే శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనీసం లంచ్ కైనా తిరిగి వస్తారని అనుకోగా ఆయన రాలేదు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలవడానికి ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బన్నీ పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసిపి నేత శిల్పా రవి రెడ్డి కి సపోర్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఇంకా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం దూరం జరగడంతో జనసేన అభిమానులు అల్లు అర్జున్ ని ఇంకా దూరం పెడుతున్నారని సమాచారం .

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×