Allu Arjun Political Entry : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2) నామస్మరణతో ప్రస్తుతం మూవీ లవర్స్ ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే ఒక సెన్సేషనల్ వార్త తెరపైకి వచ్చింది. దానికి కారణం ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor)తో భేటీ అయ్యారు అనే రూమర్. అసలేం జరుగుతోందంటే…
చాలాకాలంగా అల్లు అర్జున్ (Allu Arjun) పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త టాలీవుడ్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు మెగా – అల్లు వివాదం రచ్చ నడుస్తుంటే, మరోవైపు గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి కాకుండా అల్లు అర్జున్ వైసిపి లీడర్ కి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాలలో ఆయన పర్యటిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కలవడానికి వెళ్లారు. దీంతో ఈ విషయం వివాదాస్పదమైంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ నేతలే కాకుండా అల్లు అర్జున్ పర్యటనపై మెగా, పవర్ స్టార్ అభిమానులు ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ పై మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. దీంతో అల్లు అర్జున్ ఏకంగా తన సినిమాని వాయిదా వేసుకున్నారనే టాక్ నడిచింది.
ఇక ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాని అన్ ఫాలో చేయడం, రీసెంట్ గా వరుణ్ తేజ్ (Varun Tej) ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆ ఎఫెక్ట్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ టైంలో పడింది. అయితే అంతకంటే ముందుగానే ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ డేట్ మారుస్తున్నామంటూ నిర్మాతలు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అయితే అదే రోజు మధ్యాహ్నం సెన్సేషనల్ వార్తను రివిల్ చేయబోతున్నాం అంటూ ఓవైపు వైసిపి, మరోవైపు టిడిపి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరుకోవడం, కరెక్ట్ గా అదే టైమ్ కి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ ప్రకటించడంతో… అల్లు అర్జున్ తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించబోతున్నాడు అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే అల్లు అర్జున్ లేకుండానే ఆ ప్రెస్ మీతో ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ డేట్ ని నిర్మాతలు అనౌన్స్ చేశారు.
ఇక ఆ తర్వాత రిలీజ్ టైంలో మెగా అభిమానులు అల్లు అర్జున్ మెగా బ్రదర్స్ కి సారీ చెప్పాల్సిందే అంటూ పట్టుబట్టారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ ను గెస్ట్ గా ఆహ్వానిస్తే వివాదం సద్దుమనుగుతుందని మేకర్స్ భావించారని, కానీ ఆయన అభిమానుల అల్టిమేటంతో హ్యాండ్ ఇచ్చారని టాక్ నడిచింది. ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే ఇటు చిరు (Chiranjeevi) గానీ, అటు పవన్ (Pawan Kalyan) గానీ తమ అభిమానుల ఆగ్రహానికి అడ్డుకట్ట వేసే మాట మాత్రం సాయమైనా చేయకపోవడం గమనార్హం. పైగా రిలీజ్ కు ముందుగానీ, తరువాత గానీ ఒక్క మెగా హీరో కూడా కనీసం ట్వీట్ చేయకపోవడంతో పుష్పగాడి వార్ వన్ సైడ్ అని తేలిపోయింది. అయినప్పటికీ సినిమా సక్సెస్ అయ్యింది.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు అనే వార్త సంచలనంగా మారింది. దీంతో బన్నీ అందుకే బీహార్, పాట్నాలో ‘పుష్ప 2’ మూవీ ఈవెంట్ పెట్టాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ భేటీలో ప్రశాంత్ కిషోర్ తో పాటు అల్లు అర్జున్, బన్నీ వాసు, ఒక పారిశ్రామికవేత్త కొడుకు భేటీ అయినట్టుగా టాక్ నడుస్తోంది. ప్రశాంత్ కిషోర్ పదేళ్లపాటు సామాజిక చేసిన తర్వాతే రాజకీయాల్లో రాణించటానికి అవకాశం ఉంటుంది అని బన్నీకి సలహా ఇచ్చినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. దీంతో త్వరలోనే అల్లు అర్జున్ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే పవన్ కు పోటీగా అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టేనని, త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.