Indian Railways Rule: రైల్వే నిబంధనలపై మనం ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలి. లేకుంటే మనకు చిక్కులన్న విషయం తెలిసిందే. ఏరోజుకారోజు రైల్వే రూల్స్ పై అవగాహన కలిగి ఉంటే చాలు.. మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. లేకుంటే మనం జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. అందుకే రైల్వే రూల్స్ తెలుసుకోవడం ఒక్కటే కాదు.. పాటించాలి కూడా. అయితే ఇప్పుడు మీరు తెలుసుకొనే రూల్ చాలా వరకు ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చు. ఈ రూల్ మీకు చిన్నదే కావచ్చు.. జరిమానా మాత్రం రూ. 500 చెల్లించాల్సిందే. ఇంతకు ఆ రూల్ ఏమిటో తెలుసుకుందాం.
రోజురోజుకూ రైలు ప్రయాణానికి ప్రయాణికులు చూపిస్తున్న ఆదరణ అదుర్స్. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణమే మేలంటారు ప్రయాణికులు. ఇలా లక్షల్లో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎందరో రైల్వే అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జీఆర్పీఎఫ్, రైల్వే పోలీసులు తమ విధులతో ప్రయాణికుల, రైల్వే రక్షణ భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణీకులకు రైల్వే శాఖ మెరుగైన సేవలు అందించేందుకు నిబంధనలను పక్కాగా అమలు చేస్తోంది. ఈ నిబంధనలను పాటించకపోతే, జరిమానాలు తప్పవు. ఈ రూల్స్ పాటించి తమకు సహకరించాలని రైల్వే శాఖ కోరుతోంది.
ఇటీవల ఏ రైలులో చూసినా, ప్రయాణికులు వేసిన చెత్త మనకు కనిపిస్తోంది. అది కూడా అక్కడ చెత్త కుండీ ఉన్నా కూడా, ఏ మాత్రం అందులో చెత్త వేయకుండా రైలులోనే చెత్త వేస్తున్న దృశ్యాలను రైల్వే గమనించింది. ఈ వ్యవహారంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నట్లు, రైల్వే కు ఫిర్యాదులు అందాయి. ఇదే పని అమెరికా వంటి విదేశాలలో చేస్తే మాత్రం జైలుకు వెళ్ళాల్సిందే.
Also Read: WhatsApp : ఇకపై వాట్సాప్ లోనే ట్రాన్స్లేషన్.. ఎలా పనిచేస్తుందంటే!
అందుకే ఇప్పుడు రైల్వే కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రైలులో ప్రయాణించే సమయంలో ఇష్టారీతిన చెత్త వేసిన యెడల జరిమానా తప్పదని రైల్వే నిబంధన అమలులోకి వచ్చింది. మనం ప్రయాణించే రైలు.. పరిశుభ్రతగా ఉండడం మనతో పాటు ఇతర ప్రయాణికుల ఆరోగ్యానికి శ్రేయస్కరమన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఈ నిబంధన ఉల్లంఘించి రైలులో చెత్త వేయడం, రైల్వే అధికారులు గమనించారా మీకు అక్షరాలా రూ. 500 జరిమానా విధిస్తారు. అందుకే ఇదేదో చిన్న పనే కదా అనుకుంటారేమో.. ముందు మన రైళ్ల శుభ్రత మనకు ముఖ్యం.. అందుకే ఈ రూల్ పాటించండి.. రైళ్ల శుభ్రతకు సహకరించండి.