Allu Arjun : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి (Gangotri) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆర్య (Aarya) సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఆర్య సినిమా ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆ సినిమాతో ఒక సరైన దర్శకుడు దొరికాడు అనే అభిప్రాయం చాలా మందిలో కలిగింది. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు అని ఆశ్చర్యపరిచి మంచి సక్సెస్ కొట్టాడు దర్శకుడు సుకుమార్ (Sukumar). అప్పటినుండి సుకుమార్ కు కూడా కొంతమంది ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. సుకుమార్ సినిమాలు చాలామందికి ఫేవరెట్ ఫిలిమ్స్ అని చెప్పాలి. ఇంకా పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు. అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సాధించుకున్నాడు.
Also Read : Actress Pragya Nagra: టాలీవుడ్ నటి ప్రగ్యా ప్రైవేట్ వీడియో లీక్..
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాకి నార్త్ లో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అందుకని ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ లో ఎక్కువ ఆ ప్రేక్షకులు ఇష్టపడే అంశాలను కూడా జోడించాడు సుకుమార్. రీసెంట్ గా రిలీజ్ ఆ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది పుష్ప 2 (Pushpa 2) సినిమా. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ యాక్టింగ్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 4వ తారీఖు రాత్రి నుండి ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్లో ఈ సినిమాను ఫ్యామిలీతో పాటు చూసాడు అల్లు అర్జున్.
Also Read : Varun Sandesh: కానిస్టేబుల్ గా మారిన హ్యాపీ డేస్ హీరో..
సంధ్య థియేటర్లో సినిమా చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలానే ఒక ఫ్యామిలీ కూడా సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి టికెట్లు సిద్ధం చేసుకుంది థియేటర్ కి వెళ్ళింది. అయితే ఆ థియేటర్ కి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాటు రావడంతో థియేటర్ వద్ద తొక్కిసలాట మొదలైంది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీకి సంబంధించిన తల్లి చనిపోయారు,కొడుకు పరిస్థితి విషమంగా గా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ఫ్యామిలీకి సంతాపం కూడా తెలియజేశారు. అలానే చిత్ర యూనిట్ నుంచి వాళ్లను కలిసి మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ ఘటన గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ ప్రస్తుతం వీడియో బైట్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం వస్తుంది. అంతేకాకుండా త్వరలో ఆ ఫ్యామిలీని కలవనున్నారట అల్లు అర్జున్.