Indian Railways: అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకు దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ఈ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లనున్నాయి. అయ్యప్ప మాలధారులతో పాటు, భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ రైళ్లను షెడ్యూల్ చేసింది. హైదరాబాద్ మౌలాలి, కాచిగూడతో పాటు ఏపీలోని నర్సాపూర్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన బుకింగ్స్ ఇవాళ మొదలయ్యాయి.
మౌలాలి నుంచి వెళ్లే శబరిమల ప్రత్యేక రైళ్లు
07193 నెంబర్ గల ప్రత్యేక రైలు డిసెంబరు 11, 18, 25 తేదీల్లో మౌలాలి రైల్వే స్టేషన్ నుంచి కొల్లాంకు బయల్దేరుతుంది. అటు 07194 నెంబర్ గల ప్రత్యేక రైలు కొల్లాం నుంచి మౌలాలికి డిసెంబరు 13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. అదనంగా డిసెంబరు 14, 21, 28 తేదీలలో మౌలాలి నుండి కొల్లాంకు 07149 నెంబర్ గల రైలు నడుస్తుంది. అటు 07150 నెంబర్ గల ప్రత్యేక రైలు డిసెంబర్ 16, 23, 30 తేదీల్లో కొల్లాం నుంచి మౌలాలికి తిరిగి వస్తుంది. ఈ రైలు కొల్లాం నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 9:50 గంటలకు మౌలాలికి చేరుకుంటుంది.
కాచిగూడ, నర్సాపూర్ నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే సంస్థ జనవరి 2, 9, 16, 23 తేదీల్లో కాచిగూడ నుంచి కొట్టాయంకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైలు జనవరి 3, 10, 17, 24 తేదీల్లో కొట్టాయం నుంచి కాచిగూడకు తిరుగు ప్రయాణం అవుతుంది. అటు జనవరి 6, 13 తేదీల్లో ఏపీలోని కాకినాడ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైలు నడుస్తుంది. జనవరి 8, 15 తేదీల్లో కొల్లాం నుంచి కాకినాడకు తిరుగు ప్రయాణం అవుతుంది. అటు జనవరి 20, 27 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైలు వెళ్లుంది. అదే రైలు జనవరి 22, 29 తేదీల్లో కొల్లాం నుంచి నర్సాపూర్‌కు తిరుగు ప్రయాణం అవుతుంది.
Read Also: హైపర్‌లూప్ ట్రైన్ టెస్టింగ్ ట్రాక్ సిద్ధం చేసిన ఐఐటీ మద్రాస్.. రెప్పపాటులో గమ్యానికి చేరిపోవచ్చట!
క్రిస్మస్, సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
త్వరలో క్రిస్మస్, సంక్రాంతి పండుగలు వస్తున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా డిసెంబర్ 6 నుంచి 30వ తేదీ వరకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, బ్రహ్మపూర్ కు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు(07097) డిసెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు(07098) డిసెంబర్ 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 7:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
పెరుగుతున్న ప్రయణీకుల రద్దీని కంట్రోల్ చేయడానికి సౌత్ సెంట్రల్ రైలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మీరు కూడా వెంటనే ఈ స్పెషల్ ట్రైన్లలో టికెట్లు బుక్ చేసుకోండి. హ్యాపీగా జర్నీ చేయండి.
Read Also:స్పీడు పెంచిన వందే భారత్.. ఈ రూట్లో మరింత వేగంగా గమ్యానికి, ఎంత టైమ్ తగ్గుతుందంటే..