Varun Sandesh: క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమా గుర్తుందా.. ? ఏం మాట్లాడుతున్నారు ఆ సినిమాను ఎవరు మర్చిపోతారు.. అది చూసేగా మేము ఇంజినీరింగ్ చేసింది అంటారా.. ? ఓకే. ఆ సినిమాలో హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్ సందేశ్.. ఆ తరువాత కొత్త బంగారు లోకం సినిమాతో ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.
ఇక ఈ రెండు సినిమాల తరువాత ఎన్నో సినిమాలు చేశాడు. కానీ, అంతటి విజయాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఆ సమయంలోనే నటి వితికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చినా.. వరుణ్ కు హిట్ అందలేదు. దీంతో కొన్నిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అనంతరం వరుణ్ – వితిక కపుల్ కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టారు. హౌస్ లో తన గేమ్ తో, వ్యక్తిత్వంతో సెటిల్ గా ఆడి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు.
Kanguva: ఓటీటీలోకి కంగువ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
ఇక బిగ్ బాస్ తరువాత అయినా వరుణ్ కు కలిసి వస్తుందని అనుకున్నారు. ఎప్పుడు ఒకేలాంటి కథలు కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మధ్యనే నింద, విరాజి అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నింద సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు కానీ, ఓటీటీలో మాత్రం మంచి విజయాన్నే అందుకుంది. రాజేష్ జగన్నాథం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని వరుణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా వరుణ్ సందేశ్ నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్. ఆర్యన్ సుభాన్ ఎస్ కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన మధులిక వారణాసి నటిస్తోంది. ఇక ఈ సినిమాను బలగం జగదీశ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ కానిస్టేబుల్ గా కనిపిస్తున్నాడు.
నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రిలీజ్ చేసి.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో బైక్ పై వరుణ్ సందేశ్, మధులిక పోలీస్ డ్రెస్ లో వెళ్తూ కనిపించారు. పోలీస్ గా వరుణ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నట్లు నిర్మాత తెలిపాడు.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ సినిమా తెరకెక్కిందని, ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంతో ఉన్నామని మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వరుణ్ సందేశ్ హిట్ ను అందుకుంటాడా . . లేదా తెలియాలంటే కానిస్టేబుల్ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.