Sandeep Reddy Vanga: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న సందీప్.. అదే సినిమా రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకేమైన గుర్తింపును అందుకోవడమే కాకుండా రణబీర్ కపూర్ తో అనిమల్ లాంటి సినిమా తెరకెక్కించే ఛాన్స్ పట్టేశాడు.
ఇక అనిమల్ సినిమా ఇండస్ట్రీని ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా .. వాటిని పట్టించుకోకుండా సందీప్ తనకు నచ్చిన కథలతోనే ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. అనిమల్ కే ఈ రేంజ్ లో ఉంటే త్వరలో అనిమల్ పార్క్ రానుంది. ఇక అది వచ్చేలోపు సందీప్.. తెలుగులో స్పిరిట్ ను రెడీ చేస్తున్నాడు. ఇప్పటివరకు డార్లింగ్ ప్రభాస్ ను ఫైర్ గానే చూశారు. అంటే యాక్షన్ ఒక శాతం మాత్రమే చూశారు.
ఇక అనిమల్ లాంటి డైరెక్టర్ చేతిలో ప్రభాస్ పడితే వైల్డ్ ఫైర్ ను చూపిస్తాడు. ఇందులో మాత్రం సందేహం లేదు. స్పిరిట్ ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా.. ? అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సందీప్ సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా ఏదో ఒక టైమ్ లో మాత్రం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు.
Pattudala Trailer: పట్టుదల ట్రైలర్.. యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా అదరగొట్టిన అజిత్
ఈ సంక్రాంతికి సందీప్ గాలిపటాలను ఎగరేస్తూ కనిపించిన విషయం తెల్సిందే. ఫ్రెండ్స్ తో కలిసి ఒక మేడ మీద గాలిపటాలు ఎగరేస్తూ.. అల్లరి చేస్తున్న వీడియోకు పవన్ కళ్యాణ్ సాంగ్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక దీంతో ఫ్యాన్స్ అందరూ.. అదేంట్రా.. అన్ని కోట్ల డైరెక్టర్ ఇంత సింపుల్ గా ఆడుకుంటున్నాడు. ఏదైనా సందీప్ లో ఇంకా కుర్రతనం పోలేదేహే అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియో పోస్ట్ చేసి సందీప్ జనాలను పిచ్చోళ్లను చేశాడు. అక్కడ గాలిపటం లేదు.. ఏమి లేదు .. అదంతా యాక్టింగ్ అని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఫ్రెండ్స్ అందరిని దగ్గరకు పిలిచి సందీప్.. ఒక చిన్న వీడియోతీయించాడు. దానికి కూడా దర్శకత్వం ఆయనే వహించాడు. కట్ చెప్పినప్పుడు అరవండి.. అని చేతిలో దారం వదలగానే వారందరూ ఓ గోల చేశారు. కట్ అని చెప్పగానే ఆపేశారు. ఈ వీడియోకు పవన్ సాంగ్ యాడ్ చేసి ప్రేక్షకులకు సంక్రాంతి విషెస్ చెప్పాడు సందీప్. ఇదంతా నిజమనుకొని ఫ్యాన్స్.. అబ్బ సూపర్ అని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూసి.. యో.. వంగా మావా.. జనాల్ని పిచ్చోళ్లను చేసావ్ గా.. అదంతా యాక్టింగా.. ?. ఈ యాక్టింగ్ తో నువ్వే ఒక సినిమా తీయి, సందీప్ రెడ్డి.. జనాలను ఇంత మోసం చేస్తావా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Orey andari EP lani chesadu ra vanga mawa😭😭 Idekadi Mass acting ayya💥🤣 @imvangasandeep pic.twitter.com/9iJteM8Km3
— Prabhas Devotee🔥 (@SainathPB) January 16, 2025