BigTV English

Bider Thieves: అఫ్జల్‌గంజ్‌లో బీదర్ ఏటీఎం దొంగలు కలకలం.. ట్రావెల్ ఏజెంట్‌పై కాల్పులు

Bider Thieves: అఫ్జల్‌గంజ్‌లో బీదర్ ఏటీఎం దొంగలు కలకలం.. ట్రావెల్ ఏజెంట్‌పై కాల్పులు

Bider ATM Robbers in Hyderabad: హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ కాల్పులతో హోరెత్తింది. కర్ణాటకలోని బీదర్‌లో ఏటీఎం డబ్బును దొంగిలించిన ఇద్దరు దుండగులు.. పోలీసులపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోడానికి ఓ ట్రావెల్ ఏజెన్సీలో తలదాచుకున్నారు. దీంతో పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.


బీదర్‌లో కాల్పులు.. దోపిడి

కర్ణాటకలోని బీదర్‌ గురువారం ఉదయం కాల్పులతో హోరెత్తింది. శివాజీ చౌక్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నగదు జమా చేయడానికి వెళ్లిని ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై సిబ్బంది ముఖంపై దుండగలు కారం పొడి చల్లారు. అయినా వారు వెనక్కి తగ్గకుండా దుండగులను అడ్డుకొనే ప్రయత్నంం చేశారు. దీంతో ఆ ఆగాంతకులు ఇద్దరిపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం నగదు పెట్టెతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో సిఎంసి సిబ్బంది గిరి, వెంకటేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులకు ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


హైదరాబాద్‌లోనూ బీభత్సం

వారు ఎత్తుకెళ్లిన క్యాష్ బాక్సులో రూ.90 లక్షల వరకు నగదు ఉన్నట్లు తెలిసింది. ఆ బాక్సుతో వారు నేరుగా కర్ణాటక సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశించారు. ఈ సమాచారం అందుకున్న బీదర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి హైదరాబాద్‌కు బయల్దేదారు. ఈ విషయాన్ని ముందుగా హైదరాబాద్ పోలీసులకు కూడా తెలియజేశారు. దుండగులు అప్ఝల్‌గంజ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. వారిని పట్టుకొనేందుకు అక్కడికి వెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు ఇద్దరు రాత్రి 7.30 గంటల సమయంలో అప్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్‌కు వెళ్లారు. శుక్రవారం తెల్లవారు జాము 3.30 గంటలకు రాయ్‌పుర్‌ వెళ్లేందుకు వారు బస్ టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, ట్రావెల్ ఏజెన్సీ హెల్పర్ జహంగీర్‌కు వారిపై అనుమానం వచ్చింది. వారి బ్యాగ్స్ చెక్ చేయాలని చెప్పాడు. ఇందుకు అమిత్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్ని నోట్ల కట్టలు ఇవ్వ చూపాడు. దీంతో జహంగీర్ వారి బ్యాగ్ తెరిచి చూడగా భారీ మొత్తంలో నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అమిత్ గన్ తీసి జహంగీర్‌పై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడి నుంచి పారిపోయారు.

జహంగీర్‌‌ కడుపు, కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతడిని వెంటనే ఆసరా హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రస్తుతం జహంగీర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి కోసం పోలీసులు నగరమంతా జల్లెడపడుతున్నారు. సీసీటీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు.  హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్, రాచకొండ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్సు టికెట్ రిజర్వ్ చేసుకునే టైమ్‌లో నిందితుడిలో ఒకరు ఐడెంటీ కార్డు చూపించారని, అందులో అతడి పేరు అమిత్ కుమార్ అని ఉందని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.

బీదర్ దోపిడీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. దోపిడీ తీరును చూస్తుంటే దుండగులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది సుమారు ఆరు నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పులు జరపడంతో వారు అక్కడిక్కడే చనిపోయారు. ఆ తర్వాత దుండగులు నగదు బాక్సును ఎత్తుకెళ్లారు. దాన్ని బైక్ మీద పెట్టలేక కిందపడ్డారు. ఆ వెంటనే లేచి.. ఆ బాక్సును బైక్ హ్యాండిల్ మీద పెట్టుకుని పరారయ్యారు. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ మధ్యదారిలోనే వారు ఆ డబ్బు మొత్తాన్ని లగేజీలోకి సర్దుకున్నట్లు తెలుస్తోంది. అంటే, వారు మార్గమధ్యలోనే బ్యాగ్స్ సిద్ధం చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: ఏటీఎంలో నగదు జమా చేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి, బీదర్‌లో దోపిడీ దొంగలు హల్ చల్

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×