Allari Naresh: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో అనుదీప్ కేవీ ఒకరు. అనుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బీభత్సమైన హిట్ సాధిస్తే దానివలన దర్శకుడికి పేరుస్తుంది కానీ అనుదీప్ విషయంలో ఇది చాలా డిఫరెంట్ గా జరిగింది. సినిమా రిలీజ్ కంటే ముందే అనుదీప్ కి మంచి పేరు వచ్చింది. సుమ యాంకర్ గా కొనసాగే క్యాష్ అనే షోలో అనుదీప్ గెస్ట్ గా వచ్చాడు. అక్కడ అనుదీప్ టైమింగ్ చాలా మందిని ఆకట్టుకుంది.
వాస్తవానికి ఆ షో కి ఎవరో ఒక గెస్ట్ తక్కువ అయ్యారు. నాగ అశ్విన్ ఆ షో కి హాజరు కావలసి ఉంది. కానీ చివరి నిమిషంలో నాగి కు కుదరకపోవడం వలన దర్శకుడు అనుదీప్ హాజరయ్యాడు. ఆ షో మొదలైనప్పుడు చాలామంది నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కోసం చూశారు. కానీ సర్ప్రైజింగ్ గా అనుదీప్ కామెడీ టైమింగ్ అందర్నీ ఆకట్టుకుంది. అది సినిమాకి ప్రేక్షకులను తీసుకురావడానికి కూడా ప్లస్ అయింది. ఇకపోతే జాతి రత్నాలు సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఆ సినిమా ఎంతగా ఫేమస్ అయిందో ఆ తర్వాత అనుదీప్ ఇంటర్వ్యూస్ కూడా అంతే ఫేమస్ అయ్యాయి.
అనుదీప్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా ప్రిన్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం అందరిని బాగానే ఆకట్టుకున్నాయి. ఇక్కడ కూడా ముఖ్యంగా అనుదీప్ ఇంటర్వ్యూస్ చాలా ఫన్ గా అనిపించాయి. ఆ తర్వాత అనుదీప్ చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంటర్వ్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రతి ఇంటర్వ్యూలోని అనుదీప్ కామెడీ టైమింగ్, ఇనో సెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రజెంట్ జనరేషన్ లో కామెడీ సినిమాలు తీసే దర్శకులు తక్కువైపోయారు.
Also Read : Prasad Behara: కమిటీ కుర్రోళ్లు సినిమాలో నవ్వించిన పెద్దోడు జీవితంలో ఇంత విషాదమా.. ?
ఇక ఓన్లీ కామెడీ సినిమాలు చేసే నటులు కూడా లేరు అని చెప్పాలి. వరుసగా కేవలం కామెడీ సినిమాలు మాత్రమే చేసిన అల్లరి నరేష్ కూడా ఆ రూట్ ను వదిలిపెట్టి సరికొత్త రూట్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు అల్లరి నరేష్ అనుదీప్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ చాలా సందర్భాలలో కలిసారట. కానీ కరెక్ట్ స్టోరీ సెట్ అవ్వలేదు. ఇద్దరు ఎవరు పనుల్లో వారు బిజీగా ఉండటం వల్ల కలిసి ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఇద్దరు కలిసి సినిమా చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేష్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read : Rashmika: విజయ్ దేవరకొండ Vs బన్నీ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?రష్మిక ఊహించని కామెంట్..!