Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2021 లో ‘పుష్ప: ది రైజ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించిన విజయాన్ని సొంతం చేసుకుంది. సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నార్త్ లో ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినా సరే ఈ సినిమా అక్కడ రూ.100 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఎలాగైనా సరే సీక్వెల్ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసమే తన సమయం మొత్తాన్ని కేటాయించారు బన్నీ. అలా ఎట్టకేలకు 2024 డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్ల సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఫుల్ రన్ ముగిసే సరికి దాదాపు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ రిలీజ్ డేట్ లాక్..
పుష్ప 2: ది రూల్ సినిమా విడుదలైన ఒకటి రెండు రోజుల్లోనే ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ పేరుతో పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులలో ఆనందం ఎల్లలు దాటింది. ఇప్పటికే పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీకి, పుష్ప 2 సినిమాతో ఆస్కార్ అవార్డు వచ్చిన తక్కువే అని చాలామంది నెటిజన్స్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే పుష్ప -2 సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ ఇప్పుడు పుష్ప 3 విడుదల చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు విడుదల అవుతుంది? అనే విషయాలపై అభిమానులు చాలా ఎక్సైట్ గా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక అభిమానుల ఆత్రుతకు తెరదింపుతూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ (Ravi Shankar) ఈ సినిమా విడుదల సంవత్సరం ప్రకటించారు. 2028లో పుష్ప -3 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన తెలిపారు. తాజాగా నితిన్ (Nithin) హీరోగా నటించిన రాబిన్ హుడ్ (Robinhood) ప్రెస్ మీట్ విజయవాడలో జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే ఇప్పుడు పుష్ప3 కోసం మరో మూడేళ్లు ఎదురు చూడక తప్పదు.
అల్లు అర్జున్ సినిమాలు..
పుష్ప ఫ్రాంచైజీలు తీసుకొచ్చిన క్రేజ్ తో పలువురు స్టార్ డైరెక్టర్లు ఈయనతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నారని సమాచారం. ఇక అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. రెండు సినిమాలు పూర్తయిన తర్వాతనే అల్లు అర్జున్ – సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 3 చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే పుష్పగాడు మళ్లీ ర్యాంపేజ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో బన్నీ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.