Watermelon Side Effects: మన జీవనశైలిలో రోజు రోజుకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు అందరి ఇళ్లలో ఫ్రిజ్‌ల వాడకం పెరిగింది. ఇంట్లో ఉండే కూరగాయలు, పండ్లను, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఫ్రిజ్‌లను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉంటే సమ్మర్‌లో చాలా మంది పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. ఇలా ఫ్రిజ్‌లో పుచ్చకాయను నిల్వ చేసి తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ సమ్మర్‌లో ఎక్కువగా దొరుకుతుంది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా పుచ్చకాయ తినడం వల్ల హైడ్రేటెడ్‌గా మారుతుంది.
పుచ్చకాయలో ఉండే అమైనో ఆమ్లం సిట్రులైన్, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా ఇది రక్త పోటును నియంత్రిస్తుంది. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇదిలా ఉండు వీటిని ఫ్రిజ్ లో నిల్వ చేసి ఆ తర్వాత తినడం వల్ల పోషకాలు కోల్పోతాయి.
జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితం అయిన ఓ అధ్యయనం ప్రకారం గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పుచ్చకాయలు ఫ్రిజ్ లో స్టోర్ చేసిన పుచ్చకాయల కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయని రుజువైంది.
ఇదిలా ఉంటే.. ఒక్లహోమాలోని లేన్‌లో ఉన్న USDA యొక్క సౌత్ సెంట్రల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లాబొరేటరీ పరిశోధకులు 14 రోజుల పాటు అనేక పుచ్చకాయ రకాలను పరీక్షించారు. అంతే కాకుండా వారు 70-, 55-, 41-డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద వీటిని నిల్వ చేశారు. 70 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద నిల్వ చేసిన వాటిలో తాజాగా కోసిన లేదా ఫ్రిజ్ లో నిల్వ చేసిన వాటి కంటే గణనీయంగా ఎక్కువ పోషకాలు ఉన్నాయని కనుగొన్నారు.
Also Read: రాత్రి పూట పదే పదే నిద్ర లేస్తున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !
గది ఉష్ణోగ్రత:
పుచ్చకాయ యొక్క సాధారణ గది ఉష్ణోగ్రతలో ఉంచినా కూడా 14 నుండి 21 రోజులు నిల్వ ఉంటుంది. అందుకే వీటిని కోస్తే మాత్రం అప్పటికప్పుడు తినడం మంచిది. లేదంటే ఇంట్లోని ఓ మూలన స్టోర్ చేసుకోండి. కానీ ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదని గుర్తుంచుకోండి.