BigTV English

Allu Shirish: బన్నీ తమ్ముడు శిరీష్ పెళ్లి.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

Allu Shirish: బన్నీ తమ్ముడు శిరీష్ పెళ్లి.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

Allu Shirish: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా కేతిక, ఇవానా హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వంలో మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ టీం ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ విష్ణు, కేతిక, ఇవానా చిత్ర యూనిట్ తో కలిసి సింగిల్ విత్ బ్లాస్ట్ అంటూ ఈవెంట్ నిర్వహించారు. అందులో భాగంగా అల్లు అరవింద్ తన కొడుకు అల్లు శిరీష్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


బన్నీ తమ్ముడు శిరీష్ పెళ్లి..

ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు లేటెస్ట్ గా వస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం సింగిల్. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లు అరవింద్, అల్లు శిరీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సుమ యాంకరింగ్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వెన్నెల కిషోర్ కామెడీతో ఈవెంట్ లో అలరించారు. సుమ దగ్గరగా ఇదే ఫస్ట్ టైం చూడ్డం చూడలేకపోతున్నాను అని వెన్నెల కిషోర్ అనడంతో అక్కడున్న వారంతా నవ్వుతారు. ఇక సుమ రాహుల్ సిప్లిగంజి తో మాట్లాడుతూ మీరు తొందరలో గుడ్ న్యూస్ చెప్తా అన్నారు కదా చెప్తారా అని అడిగితే తొందరలోనే చెప్తాను ఇప్పుడు కాదు అని అంటాడు.


అల్లు అరవింద్ కామెంట్స్…

అల్లు శిరీష్ దగ్గరికి వెళ్లి, ఎన్ని సంవత్సరాల నుంచి మీ నాన్నగారు నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు మీరు ఎందుకు చేసుకోవట్లేదు అని అంటుంది. మా ఇంట్లో వాళ్లకన్నా మీరు ఎక్కువ అడుగుతున్నారు మీరు ఎప్పుడు కలిసినా గానీ నన్ను పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు సంబంధం చూస్తారా ఏంటి అని అంటాడు. పక్కనే ఉన్న అల్లు అరవింద్ పదేళ్ల నుంచి పెళ్లి చేసుకోమని బతిమిలాడుతున్న వాడు చేసుకోవట్లేదు అని అంటాడు. అల్లు శిరీష్ పెళ్లయిన వాళ్ళ దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకోమంటారా లైఫ్ ఎలా ఉంటుంది అని అడిగితే చేసుకోవద్దు సింగిల్గానే లైఫ్ బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అల్లు శిరీష్ అంటారు. సుమ నేను పెళ్లి చేసుకోను అని అన్నవాళ్లంతా ఏదో ఒక రోజు చేసుకోవాల్సిందే మీరు చేసుకుంటారు నేను వస్తాను అక్కడికి అని సుమా వెళ్లిపోతుంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా, హీరోయిన్స్ గా చేస్తున్నారు వెన్నెల కిషోర్ కీలక పాత్రలో హీరో ఫ్రెండ్ గా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో మూవీ పై అంచనాలను పెంచేశారు. గీత ఆర్ట్స్ లో వర్క్ చేయడం శ్రీ విష్ణు అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. 100% కామెడీతో ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల రానుంది అందరూ సినిమా చూడండి అంటూ శ్రీ విష్ణు తెలిపారు.

Single Movie : వెన్నల కిషోర్ మనిషి కాదా..? పాపం అందరి ముందు పరువు తీసిన కేతిక

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×