Single Movie: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సింగిల్ మూవీతో మన ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలకపాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రం మే 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ టీం ఇప్పటికే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈటీవీలో సుమ అడ్డా ప్రోగ్రాం కు సింగిల్ మూవీ టీం విచ్చేశారు. ఆ షోలో హీరోయిన్ కేతిక వెన్నెల కిషోర్ పై కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.
పాపం అందరి ముందు పరువు తీసిన కేతిక..
సుమా అడ్డ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమ యాంకరింగ్ తోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. తాజాగా సుమ అడ్డా ప్రోమో వచ్చేసింది. అందులో సింగిల్ మూవీ టీం పాల్గొన్నారు. హీరో శ్రీవిష్ణు, కేతిక, ఇవానా, వెన్నెల కిషోర్, సుమ అడ్డాకు విచ్చేశారు. మే 11న ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. అసలు విషయానికి వస్తే, ఈ ప్రోమోలో కేతిక శర్మ,వెన్నెల కిషోర్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసింది. ప్రోమోలో సుమా వెన్నెల కిషోర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలుగులో చెప్పండి అని కేతికాను అడుగుతుంది. వెన్నెల కిషోర్ గారు చాలా మంచి… మని.. మని మనిషి అని అంటుంది. మీరు మంచి మనిషి అవునా కాదా అని ఆమెకి మీ మీద డౌట్ ఉంది అని సుమా వెన్నెల కిషోర్ తో అంటుంది. అది చూసి అక్కడ ఉన్న మూవీ టీమ్ అంతా నవ్వుతారు. ఈ వీడియో చూసిన వారంతా వెనుల కిషోర్ మనిషి అని చెప్పడానికి కేతిక ఎంత కష్టపడింది పాపం అందరి ముందు ఆయన పరువు తీసేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇద్దరు హీరోయిన్స్ తో..వెన్నెల కిషోర్ ..
ఇక ఈ ప్రోమోలో సుమ సింగిల్ మూవీ టీం తో గేమ్స్ ఆడిస్తుంది. వారిని చాలా ప్రశ్నలు వేస్తుంది. ముఖ్యంగా శ్రీవిష్ణు తో మీరు సింగిల్ లైఫ్ అడ్వాంటేజెస్ చెప్పండి అని అడుగుతుంది. శ్రీ విష్ణు అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి,రెండు మిస్ అవుతాం అంతే అని సమాధానం ఇస్తాడు. అదే ప్రశ్నకు కేతిక.. సింగిల్ ఈజ్ బెటర్ అని అంటుంది. ఇక మరో హీరోయిన్ ఇవానా కొంత టైం వరకు సింగిల్ గా ఉంటే బాగుంటుంది ఆ తర్వాత మింగిల్ అవ్వాలి అని అంటుంది. ఆ మాటకు వెన్నెల కిషోర్ ఈ షో ఎవరో చూస్తున్నారు అందుకే ఆమె ఎలా మాట్లాడుతుంది అని అంటాడు. షోలో కేతిక ఇవానా తో వెన్నెల కిషోర్ డాన్స్ చేస్తారు. అయన హ్యాండ్సమ్ గా ఉండడానికి గల కారణం ఏంటి అని సుమా అడుగుతుంది. వర్కౌట్స్, డైట్ కంట్రోల్ చేయడం అని శ్రీవిష్ణు చెబుతూ ఉండగా నేను మాట వరకే అడిగాను అని అంటుంది. నేను మాటవరకే చెప్పాను అంటాడు శ్రీవిష్ణు. సుమ డ్రైవింగ్ స్కూల్ అనే కాన్సెప్ట్ వెన్నెల కిషోర్ ఇద్దరు హీరోయిన్స్ తో కారు డ్రైవింగ్ స్కిట్ తో అలరిస్తారు. అధ్యంతం ప్రోమో అంత ఆకట్టుకుంటుంది. ప్రోమో చివర వెన్నెల కిషోర్ కు సుమ ఆవకాయి టేస్ట్ చేయమని వెంటపడే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. ఫుల్ కామెడీగా ఈ ప్రోమో సాగుతుంది. మే 11న ఫుల్ ఎపిసోడ్ ఈటీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఈ ప్రోమో చూసిన వారంతా ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీ విష్ణు సినిమాలు..
టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తారు. మంచి కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. సామజ వరగమన కామిడీ ఎంటర్టైనర్ గా మంచి హిట్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఓం భీమ్ బిష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గత ఏడాది స్వేగ్ సినిమాతో మన ముందుకు వచ్చారు కానీ ఆశించినంత స్థాయిలో ఆ సినిమా సక్సెస్ ని అందుకోలేదు. ఇప్పుడు శ్రీవిష్ణు ఆశలన్నీ సింగిల్ మూవీ పైనే ఉన్నాయి. కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్యకొప్పినీడు,భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, నిర్మాతలుగా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ పతాకంపై ఈ మూవీ రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా ఇప్పటికే సెన్సార్ ని పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nithiin: తమ్ముడు సినిమాపై బిగ్ అప్ డేట్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?