Toners For Dry Skin: వర్షాకాలం వచ్చిన వెంటనే.. చర్మంపై తేమ వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం మంచిది. బయట మార్కెట్‌లో దొరికే ఫేస్ టోనర్లను వాడటం వల్ల చర్మానికి మరింత నష్టం కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. ఇంట్లో తయారుచేసిన సహజ టోనర్లు సురక్షితంగా ఉండటమే కాకుండా.. చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తాయి. మీ డ్రై స్కిన్‌ను తాజాగా, తేమగా ఉంచడంలో సహాయపడే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన , పూర్తిగా ఇంట్లో తయారుచేసిన ఫేషియల్ టోనర్ల గురించి తెలుసుకోవడం ముఖ్యం .
1. రోజ్ వాటర్, గ్లిజరిన్ టోనర్:
రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా గ్లిజరిన్ దానిలోని తేమను లాక్ చేయడానికి పనిచేస్తుంది. ఈ రెండూ కలిసి అద్భుతమైన టోనర్‌గా పనిచేస్తాయి.
కావాల్సినవి:
3 టేబుల్ స్పూన్లు- రోజ్ వాటర్
1 టీస్పూన్- గ్లిజరిన్
తయారు చేయడం , ఉపయోగించడం ఎలా:
పై పదార్థాలను బాగా కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి. ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత.. ఈ టోనర్‌ను స్ప్రే చేయండి లేదా కాటన్‌తో అప్లై చేయండి.
2. దోసకాయ, కలబంద టోనర్:
దోసకాయ, కలబంద రెండూ చర్మాన్ని చల్లబరిచి, హైడ్రేట్ చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ టోనర్ ఎండలో కాలిపోయిన చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
1/2- దోసకాయ (తురిమిన)
2 టీస్పూన్లు- కలబంద జెల్
1/4 కప్పు- నీరు
తయారు చేయడం, ఉపయోగించడం ఎలా ?
దోసకాయ రసం తీసి అందులో కలబంద, నీరు కలపండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. రోజుకు 2-3 సార్లు ముఖానికి అప్లై చేయండి.
3. గ్రీన్ టీ , వేప టోనర్ :
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా , మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.
Also Read: ఫేషియల్స్ అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్ వాడితే చాలు
కావాల్సనవి:
1 గ్రీన్ టీ బ్యాగ్
కొన్ని వేప ఆకులు
1 కప్పు- నీరు
తయారు చేయడం, ఉపయోగించడం ఎలా:
గ్రీన్ టీ, వేప ఆకులను నీటిలో మరిగించి.. చల్లారిన తర్వాత, ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.