Manchu Lakshmi : మంచు హీరోయిన్ ని ముద్దు పెట్టుకున్న అల్లు హీరో.. వైరల్ అవుతున్న పిక్..

Manchu Lakshmi : మంచు హీరోయిన్ ని ముద్దు పెట్టుకున్న అల్లు హీరో.. వైరల్ అవుతున్న పిక్..

Manchu Lakshmi
Share this post with your friends

Manchu Lakshmi

Manchu Lakshmi : మెగా వారి దీపావళి పార్టీలో అల్లు శిరీష్, మంచు లక్ష్మీ తో దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇందులో మంచు లక్ష్మి కి అల్లు శిరీష్ ముద్దు పెడుతూ కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మంచు లక్ష్మి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిమర్స్ కు కావలసిన కంటెంట్ ఇస్తూ ఎప్పటికప్పుడు తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తుంది మంచు లక్ష్మి.

మోహన్ బాబు ..టాలీవుడ్ యాక్టర్స్ లో ఏది ఉన్న ముక్కు సూటిగా మాట్లాడే నటులలో మొదటివాడు. ఎలాంటి క్యారెక్టర్ లో అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసే టాలెంట్ ఉన్న యాక్టర్ మోహన్ బాబు అనడంలో డౌటే లేదు. తండ్రి వారసత్వం పునికి పుచ్చుకుంది మంచు లక్ష్మి. మోహన్ బాబు కూడా అందుకే ఎక్కువగా కొడుకుల కంటే కూడా కూతురు గురించే మాట్లాడుతాడు. టాక్ షో లతో మంచి ఫేమ్ సంపాదించిన లక్ష్మి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా, విలన్ గా కూడా నటించి.. మెప్పించింది.

సెలబ్రిటీలతో ఎప్పుడు సందడిగా ఉండే లక్ష్మి మెగా వారి దీపావళి ఫంక్షన్లో కనిపించింది. సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబుకి ,చిరంజీవికి మధ్య చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అన్న పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనికి తగ్గట్టు కొన్ని సందర్భాలలో వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలు కూడా అలాగే ఉండేవి. వీళ్ళ మధ్య ఏముందో తెలియదు కానీ మోహన్ బాబు పిల్లలు మాత్రం సోషల్ మీడియాలో మెగా హీరోల గురించి ఎప్పుడూ పాజిటివ్ గానే స్పందిస్తారు.

 రామ్ చరణ్ దీపావళి పార్టీకి అటెండ్ అయిన మంచు లక్ష్మి ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసుకుంది. రామ్ చరణ్, వెంకటేష్ ఇలా చాలామందితో మంచు లక్ష్మి ఫొటోస్ దిగింది. అయితే అన్నిటికంటే ఎక్కువగా అల్లు శిరీష్.. మంచు లక్ష్మి బుగ్గ పై ముద్దు పెట్టే ఫోటో అందర్నీ ఆకర్షించింది. మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక ఫోటోలో అల్లు శిరీష్ మంచు లక్ష్మి ని ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు మంచు లక్ష్మికి అల్లు హీరో ముద్దు పెట్టేసాడు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు నేటిజన్స్.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Jio Satellite Internet : జియో నుంచి ఇక శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు.. టాటా ఐ ఫోన్స్

Bigtv Digital

Yashoda Twitter Review : సినిమాకు సమంత లైఫ్‌లైన్.. సెకండ్ హాఫ్ సూపర్బ్..

BigTv Desk

Kavitha : సీబీఐకి కవిత లేఖ.. అవి ఇవ్వాలని డిమాండ్..మరో ట్విస్ట్..

BigTv Desk

Summer Effect : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. ఏపీకి వడగాల్పుల ముప్పు..

Bigtv Digital

CM KCR: సలహాదారులే కేసీఆర్ సైన్యమా? వారితో ఉపయోగమా?

Bigtv Digital

Adani: అదానీ కేసులో సుప్రీంకోర్టు ట్విస్ట్.. మోదీకి షాక్ తప్పదా?

Bigtv Digital

Leave a Comment