
Parigi Hospital : తెలంగాణలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే ఓ డాక్టర్ అదే ఆస్పత్రిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీకెండ్ వస్తే చాలు ఒకప్పుడు తాను ఒక్కడే బయటి నుంచి యువతులను తెచ్చుకొని రాత్రంతా వారితో ఆస్పత్రిలోనే గడిపేవాడు. అంతటితో ఆగక ఇప్పుడు తన స్నేహితులను పిలిచి వారికోసం కూడా యువతులను తీసుకొస్తున్నాడు. అతనెవరో కాదు పరిగి ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే డాక్టర్ రెహాన్.
పరిగి ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తూ ప్రతి శని, ఆదివారాల రోజుల్లో డాక్టర్ రెహాన్ తన గదిలోనే బయట యువతులతో రాత్రులు గడుపుతున్నాడు. ఇలా అతను కొంతకాలంగా చేస్తున్నాడని సమాచారం. దీంతో పాటుగా ఇప్పుడు తన స్నేహితుడిని కూడా అక్కడికి పిలిచి తన రాసలీలలు ఏ అడ్డులేకుండా కొనసాగిస్తున్నాడు. అతని చేష్టలు ఒకరు వీడియో తీయడంతో బయటపడ్డాయి. ఆ వీడియోలో డాక్టర్ రెహాన్‌తోపాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినప్పుడు.. వారంతా జూనియర్ డాక్టర్లని, వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకు అప్పుడప్పుడు తీసుకొస్తున్నానంటూ బుకాయిస్తున్నాడు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి ఉన్నతాధికారులను అడిగితే.. ఈ ఆస్పత్రిలో ట్రైనింగ్ కోసం అనుమతులు లేవని తెలిపారు. డాక్టర్ రెహాన్ గురించి విచారణ చేసి.. చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.