Allu Sneha Reddy: అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) భార్యగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. రాజకీయ నాయకురాలు కూతురు కూడా.. నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూతురే అల్లు స్నేహ రెడ్డి. ఈయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. పైగా అల్లు స్నేహారెడ్డి కోట్ల రూపాయలకు యజమాని.. సాంకేతిక రంగాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈమె వ్యాపారాల ద్వారా వందల కోట్ల రూపాయలను వెనకేసింది. ఇక తొలిసారి ఒక వివాహానికి వెళ్ళిన అల్లు అర్జున్, అక్కడ స్నేహారెడ్డిని చూడగానే ఆమె ప్రేమలో పడిపోయారట. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2010లో వీరి నిశ్చితార్థం జరగగా.. 2011లో వీరు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అయాన్ , అర్హ కూడా ఉన్నారు.
ఏప్రిల్ థింగ్స్..
అటు అల్లు స్నేహారెడ్డి తన వ్యాపార నిర్వహణతో పాటు కుటుంబ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది. అంతేకాదు ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫిట్నెస్ సీక్రెట్ ను అభిమానులతో పంచుకుంటూనే.. తన కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో ఏం జరిగింది అనే విషయాన్ని ఏప్రిల్ థింగ్స్ అంటూ ఆయా ముఖ్యమైన సందర్భాలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసి అభిమానులతో పంచుకుంది..
తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో మొదటి ఫోటోలో తన భర్త ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ తో పాటు తన కూతురు అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అయిన అల్లు అర్హ తో కనిపించింది. ఇందులో సాంప్రదాయమైన దుస్తులలో కనిపించి, చాలా చక్కగా అందరిని ఆకట్టుకున్నారు. ఫెస్టివల్స్ సందర్భంగా షేర్ చేసిన ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంది.
స్వీట్ మెమోరీస్ ని పంచుకున్న అల్లు స్నేహ రెడ్డి..
ఇక రెండవ ఫోటోలో అల్లు స్నేహారెడ్డి తల్లి గారి పుట్టినరోజు వేడుకలను అల్లు స్నేహారెడ్డి కూతురు అల్లు అర్హ, అల్లు అయాన్ తో పాటు మరికొంతమంది పిల్లల సమక్షంలో ఆమె కేక్ కట్ చేశారు. మరొక ఫోటోలో అల్లు అయాన్, అల్లు అర్హ తన ఫ్రెండ్స్ తో కలిపి దిగిన ఫోటోలను షేర్ చేయగా.. ఆ తర్వాత ఫోటోలు అల్లు స్నేహారెడ్డి మరొకరితో కలిసి పెళ్లి వేడుకలలో భాగంగా పసుపు దంచుతున్నట్టు ఫోటోలు షేర్ చేశారు. తర్వాత తన భర్త అల్లు అర్జున్ తో కలసి రొమాంటిక్ డేట్ నైట్ కి సంబంధించిన ఫోటోని కూడా ఆమె షేర్ చేశారు. ఇక అలా ఒక్కొక్కటిగా ఏప్రిల్ నెలలో వారికి స్పెషల్ డే గా అనిపించిన దాదాపు 8 మూమెంట్స్ ని ఆమె ఫోటోల రూపంలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.