Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా అతను నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ లోని ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్‌లో గౌతమ్ ఒక అమ్మాయితో కలిసి చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నట్లు చూపించారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, గౌతమ్ ధరించిన టీషర్ట్‌పై ‘ఇండియా’ అని ఉండగా, ఆ అమ్మాయి టీషర్ట్‌పై ‘పాకిస్తాన్’ అని ముద్రించి ఉంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో, గౌతమ్ ఒక పాకిస్తాన్ నేపథ్యం ఉన్న అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వీడియో కొందరు పోస్ట్ చేయడంతో.. కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కేవలం ఒక షార్ట్ ఫిల్మ్..
ముఖ్యంగా, గౌతమ్ టీషర్ట్‌పై ‘ఇండియా’ అని ఉండగా, ఎదురుగా ఉన్న అమ్మాయి టీషర్ట్‌పై ‘పాకిస్తాన్’ అని ఉండటం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇది కేవలం ఒక షార్ట్ ఫిల్మ్ అయినా, దానిలోని దృశ్యాలు – టీషర్ట్‌లపై ఉన్న పేర్లు ప్రస్తుత పరిస్థితుల్లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు నెటిజన్లు ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇది కేవలం కళాత్మకమైన వ్యక్తీకరణగా చూడాలని అంటున్నారు.
గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో డ్రామా చదువుతున్నాడు. విద్యార్థిగా అతను వివిధ రకాల ప్రాజెక్టుల్లో పాల్గొనడం సహజం. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అతని విద్యాభ్యాసంలో భాగంగా తీసినదిగా భావిస్తున్నారు. అయితే, దానిలోని అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేడి చర్చకు దారితీశాయి.
కొంతమంది నెటిజన్లు ఈ షార్ట్ ఫిల్మ్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు, కొంతమంది ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ఒక కళాత్మకమైన ప్రయత్నమని, విద్యార్థిగా గౌతమ్ వివిధ అంశాలను అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాడని వారు సమర్థిస్తున్నారు. టీషర్ట్‌లపై ఉన్న పేర్లను కేవలం పాత్రల గుర్తింపు కోసం ఉపయోగించారని, దీనికి మరే ఇతర ఉద్దేశాలు లేవని వారు వాదిస్తున్నారు. కళను కళగానే చూడాలని, దానిని రాజకీయ కోణంలో చూడటం సరికాదని వారు అంటున్నారు.
ఈ వీడియో ఇప్పటిది కాదు ..
మహేష్ బాబు లేదా అతని కుటుంబ సభ్యులు ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు. అయితే, సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో, రాబోయే రోజుల్లో వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవైపు గౌతమ్ తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంటే, మరోవైపు ఈ షార్ట్ ఫిల్మ్ అతనిని వివాదంలోకి నెట్టింది.
ఈ వీడియో ఓల్డ్ పాతదని, అది ఏదో యాడ్ షూట్ అయి ఉంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. ఇటీవల జరిగిన పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత మహేష్ బాబుపై వ్యతిరేకత వచ్చేలా ఈ వీడియో వక్రీకరించి వైరల్ చేస్తున్నారని గట్టమనేని అభిమానులు అంటున్నారు.
Sharwanand: సంక్రాంతి ఫార్ములాతో శర్వానంద్.. పక్కా షూర్ షాట్ గురు