Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చేసిన పుష్ప -2(Pushpa 2) సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ శరవేగంగా చేపట్టింది. ఈ క్రమంలోనే నటీనటులు కూడా ప్రమోషన్స్ నిమిత్తం అటు ఇటు తిరుగుతూ తెగ సందడి చేస్తున్నారు.మొన్నటికీ మొన్న బీహార్ రాజధాని పాట్నాలో చాలా ఘనంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించి, గ్రాండ్ సక్సెస్ అందుకుంది చిత్ర బృందం.
చెన్నై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన రష్మిక, బన్నీ..
ఇక ఇప్పుడు ‘కిస్సిక్’ సాంగ్ లాంఛ్ లో భాగంగా చెన్నైకి వెళ్లారు. అందులో భాగంగానే మైత్రి మూవీ మేకర్స్ ఒక పోస్ట్ ను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా పుష్ప -2 సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పాట ప్రోమో ని నిన్న విడుదల చేస్తూ.. నవంబర్ 24న స్పెషల్ సాంగ్ లాంచ్ చేయబోతున్నామని ప్రకటించారు. అనుకున్నట్టుగానే చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు చిత్ర బృందం. అందులో భాగంగానే రష్మిక మందన్న (Rashmika Mandanna), అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పటికే చెన్నైకి చేరుకోగా.. వైట్ కలర్ టీ షర్ట్ ధరించిన వీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నట్టు కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. ఇక ఇలా అల్లు అర్జున్, రష్మిక మందన్న చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించి సందడి చేశారు.
ఐటమ్ సాంగ్ తో మరో రికార్డ్..
ఇక పుష్ప -2 సినిమా లోని ఐటెం సాంగ్ విషయానికొస్తే.. ఇందులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీలా (Sree Leela)స్పెషల్ సాంగ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇక మరికొన్ని గంటల్లో ఈ పాట కూడా లాంచ్ కాబోతోంది. ఇక ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా స్టైలిష్ లుక్ లో, మెస్మరైజింగ్ స్మైల్ తో కనిపించి, అమ్మాయిల హృదయాలను దోచుకోబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ ఇప్పుడు ఈ ఐటమ్స్ సాంగ్ తో మరెన్ని రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాలి.
శ్రీలీలా కెరియర్..
ఇక శ్రీ లీల విషయానికి వస్తే.. ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు పైగా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్గా రికార్డు సృష్టించింది. అందులో కొన్ని సినిమాలు ఘోరంగా డిజాస్టర్ గా మరికొన్ని సినిమాల నుంచి ఈమెను తప్పించారు కూడా.. అలాంటి చిత్రాలలో గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా ఒకటి. మొదట ఈమెను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఈమె వరుస డిజాస్టర్లు చూసి, ఈమెను తప్పించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
This time it isn’t just FIRE, it is WILDFIRE 🔥🔥#Pushpa2TheRuleTrailer out now!
Telugu ▶️ https://t.co/sSVDkz2eYx
Hindi ▶️ https://t.co/OedREaMXF0
GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 5TH 💥💥#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/xnQzof3XK5
— Mythri Movie Makers (@MythriOfficial) November 17, 2024
Icon Star @alluarjun @iamRashmika are off to Chennai for the PUSHPA’S WILDFIRE EVENT 💥💥
Get ready for a spectacular evening with mesmerizing performances along with the launch of #Kissik song ❤🔥
Today from 5 PM Onwards ❤🔥
Venue : Leo Muthu Indoor Stadium, Sai Ram… pic.twitter.com/aRGiQh9Aqk— Mythri Movie Makers (@MythriOfficial) November 24, 2024