Weight Loss: బరువు పెరగడం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి అనేక పద్ధతులను ప్రయత్నించే వారు చాలా మందే ఉంటారు. బరువు తగ్గడంలో వ్యాయామంతో పాటు సరైన ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని ఆహారాలు మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో బాగా సహాయపడుతాయి. ఈ ఆహారాలు బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గుడ్లు నుండి ఓట్స్ వరకు, ఆరోగ్యకరమైన ఆహారాలు శరీరంలో శక్తిని నింపుతాయి. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.
బరువు తగ్గడానికి మీకు ఖరీదైన జిమ్ లేదా డైట్ ప్లాన్ అవసరం లేదు. బరువు తగ్గడంలో మీకు సహాయపడే ఆహార పదార్థాలు మన వంటగదిలోనే అందుబాటులో ఉంటాయి. ఇవి రుచికరమైన మాత్రమే కాకుండా బరువు తగ్గడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి. ఏ ఆహార పదార్థాలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు:
పెరుగు ప్రోటీన్ , కాల్షియం యొక్క మంచి మూలం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాకుండా జీవక్రియను పెంచుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
ఎలా తీసుకోవాలి: పెరుగును రైస్ లో తినవచ్చు . లేదా అందులో పండ్లు, గింజలు కలపుకుని తినవచ్చు.
చిట్కా: రాత్రి నిద్రించే ముందు పెరుగు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
ఓట్స్:
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఓట్స్ తినడం వల్ల మీ పొట్ట చాలా కాలం పాటు నిండుగా అనిపిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
ఎలా తీసుకోవాలి: ఓట్స్‌ను పాలలో లేదా నీటిలో వేసుకుని తినవచ్చు. మీరు దీనికి పండ్లు, గింజలు లేదా విత్తనాలను జోడించడం ద్వారా దీని రుచిని పెంచవచ్చు.
చిట్కా: ఓట్స్‌ను రాత్రంతా పాలలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినండి.
గుడ్లు:
గుడ్లు కండరాలను నిర్మించడంలో సహాయపడే ప్రోటీన్ యొక్క మంచి మూలం. ఎగ్ చాలా కాలం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఎలా తీసుకోవాలి: మీరు గుడ్లను ఉడికించి, లేదా వేయించి, లేదా ఆమ్లెట్ రూపంలో తినవచ్చు.
చిట్కా: అల్పాహారం కోసం గుడ్లు తినడం వల్ల రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుకోవచ్చు.
పప్పులు:
పప్పులో ప్రోటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. పప్పులు మీకు చాలా కాలం పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.అంతే కాకుండా ఇవి జీవక్రియను పెంచుతాయి.
ఎలా తీసుకోవాలి: మీరు పప్పును కూరగాయలతో కలిపి తినవచ్చు.
చిట్కా: పప్పును రాత్రంతా నానబెట్టి, ఆపై ఉడికించాలి. తర్వాత తినడం వల్ల జీర్ణక్రియ తేలికవుతుంది.
Also Read: వీటితో.. ఈజీగా వెయిట్ లాస్
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
బచ్చలికూర, మెంతులు , ఆవాల వంటి ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతాయి.
ఎలా తీసుకోవాలి: మీరు ఈ కూరగాయలను సలాడ్, సూప్ లలో కూడా వేసుకుని తినవచ్చు.
చిట్కా: ప్రతిరోజు మీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోండి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.