KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కు పెద్దగా రేటు రాలేదని చెప్పవచ్చు. లక్నో నుంచి బయటికి వచ్చిన కేఎల్ రాహుల్ కు 14 కోట్లు దక్కాయి. 14 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. వికెట్ కీపర్ అలాగే కెప్టెన్సీ చేయగల సత్తా ఉన్న కేల్ రాహుల్ను 14 కోట్లకు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.
Also Read: Mitchell Starc: 24.75 కోట్ల నుంచి 11.75 కోట్లకు పడిపోయిన డేంజర్ బౌలర్
Also Read: Mohammed Shami: SRH లోకి మహమ్మద్ షమీ.. ఎన్ని కోట్లు అంటే?
లక్నో ఓనర్ తో… గొడవ కారణంగా ఆ జట్టు నుంచి బయటికి వచ్చాడు కేఎల్ రాహుల్. దీంతో… అతని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి… అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే తన తోటి ప్లేయర్లు అయినా శ్రేయస్సు అయ్యారు అలాగే… రిషబ్ పంత్ దాదాపు 30 కోట్ల వరకు పలికారు.కానీ కేఎల్ రాహుల్ ధర గతంలో కంటే పడిపోయింది. గతంలో 17 కోట్లు పలికిన కేఎల్ రాహుల్ ఇప్పుడు 14 కోట్లకే.. వేలంలో అమ్ముడుపోయాడు. దీంతో ఇది అతనికి నిరాశ అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉండగా… ఐపీఎల్ 2024 టోర్నమెంట్ వరకు లక్నో సూపర్ జెంట్స్ జట్టుతో కేఎల్ రాహుల్ ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే లక్నో సూపర్ జెంట్స్ జట్టుకు వెళ్లిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు ఆ జట్టు ఓనర్ సంజయ్. దాదాపు రెండు సంవత్సరాల పాటు కేఎల్ రాహుల్ ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. మొదటి సంవత్సరం సీజన్లో… కేల్ రాహుల్ సారథ్యంలో లక్నో బాగా రాణించింది.
కానీ మొన్నటి సీజన్లో మాత్రం లక్నో సూపర్ జెంట్స్ చాలా దారుణంగా ఫ్లాప్ అయింది. కెప్టెన్గా కేఎల్ రాహుల్ బాగా ఆడినప్పటికీ మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. దానివల్ల కేఎల్ రాహుల్ కు బ్యాడ్ నేమ్ వచ్చింది. అతన్ని గ్రౌండ్ లో కూడా చాలాసార్లు లక్నో ఓనర్ సంజయ్ తిట్టారు. ఈ తరుణంలోనే ఆ జట్టును వదిలేయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాడట కేఎల్ రాహుల్.
దాని ఫలితంగానే ఇప్పుడు మెగా వేలంలోకి కేఎల్ రాహుల్ రావడం జరిగింది. అయితే కేఎల్ రాహుల్ బయటికి రావడం వల్ల అతనికి నష్టం జరిగింది. మూడు కోట్ల వరకు… కేల్ రాహుల్ నష్టపోయాడు. అయితే మూడు కోట్లు నష్టపోయినప్పటికీ ఆత్మగౌరవం మాత్రం దక్కింది.
Also Read: Rishabh Pant: లక్నోలోకి రిషబ్ పంత్.. ఏకంగా 27 కోట్లు
🎯 DC GETS KL Rahul: 14CR!
Opening x Leadership
Perfect combo!Value signing! 💫 pic.twitter.com/KRlm3rb7a0
— IPLnCricket: Everything about Cricket (@IPLnCricket) November 24, 2024