Amala Paul.. హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించి సౌత్ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఈమె.. టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలైన అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) వంటి స్టార్ హీరోల సరసన నటించి, మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇకపోతే తెలుగులో ఈమె నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అప్పట్లో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. కానీ ఆ తర్వాత కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చేసరికి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తమిళ్, మలయాళం సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైపోయింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తమిళంలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది అమలాపాల్.
కొడుకును క్రైస్తవ మతంలోకి చేర్చిన అమలాపాల్..
ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుంది. కేరళలోని కొచ్చిలో గ్రాండ్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈమె.. ఒక పండంటి కొడుకుకు కూడా జన్మనిచ్చింది. ఓనం సందర్భంగా తన కొడుకు ముఖాన్ని కూడా అందరికీ చూపించింది. భర్త జగత్ దేశాయ్, కుమారుడితో కలిసి దిగిన అద్భుతమైన ఫోటోలను నిత్యం ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ అలరిస్తోంది. ఇకపోతే ఇప్పుడు తాజాగా అమలాపాల్..” ప్రేమ శాంతితో చుట్టుముట్టిన ఇలై బాప్టిజం జరుపుకుంటున్నారు” అంటూ తన పోస్టులో రాసుకుంది. అందులో కొన్ని ఫోటోలను కూడా పంచుకుంది. ఇకపోతే బాప్టిజం జరపడం అంటే క్రైస్తవ మతంలోకి మారడం.. ఒక వ్యక్తిని నీటిలో ముంచి లేదా వారిపై నీరు పోసి తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మ పేరుతో ఆ వ్యక్తిని క్రైస్తవ మతంలోకి చేర్చి, సమాజంలోకి ఆహ్వానిస్తారు. ఒక వ్యక్తి పాపాలను కడిగి దేవుడి సేవకుడిగా గుర్తిస్తారు. దేవునితో సంబంధాన్ని ఏర్పరుచుకోవడమే ఈ బాప్టిజం. ఇకపోతే అమలాపాల్ తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Preity Zinta: ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం.. గ్రేట్ హార్ట్ అంటూ..!
అమలాపాల్ కెరియర్..
అమలాపాల్ 2009లో ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ లో ప్రవేశానికి ఒక సంవత్సరం విరామం తీసుకుంది. ఆ సమయం లో ఈమె ఫోటోలు చూసిన ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ ఈమెకు నీల తామర అనే చిత్రంలో చిన్న పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రం విజయవంతం కాకపోయినా ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ తరువాత చిత్రం వికడకవి అనే సినిమాలో ఒక పాత్ర పోషించింది. ఈ చిత్రం విడుదల బాగా ఆలస్యంగా జరిగి.. ఈమె ఆరవ సినిమాగా విడుదలైంది. ఈ మధ్యలో వీరశేఖరన్, సామవేళి వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో 2011లో బెజవాడ అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు, పిట్టకథలు వంటి సినిమాలు చేసింది. ఇక సినిమాలతో పాటు కుడి ఎడమైతే, బాధితుడు: నెక్స్ట్ ఎవరు, రాజు ఊట్ల పార్టీ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ .