BigTV English

Preity Zinta: ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం.. గ్రేట్ హార్ట్ అంటూ..!

Preity Zinta: ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం.. గ్రేట్ హార్ట్ అంటూ..!

Preity Zinta: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Priety Zinta) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె మరొకవైపు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు సహా యజమానిగా పేరు సొంతం చేసుకుంది. అలాంటి ఈమె ఇప్పుడు తాజాగా తన గొప్ప మనసును చాటుకుంది. భారత సైనిక వితంతువుల సంక్షేమ నిధి (AWWA) కి భారీ విరాళం ప్రకటించింది .దీంతో ఈమె పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు జనం.. భారత సైన్యం సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి రూ.1.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధి నుంచి ప్రీతి జింటా ఈ విరాళాన్ని అందించింది. ఇక జైపూర్ లో జరిగిన విరాళాల కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ కు చెందిన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనగా.. ఈ సందర్భంగా ఆమె కోటి రూపాయలు అందజేసింది.


ఆర్మీకి భారీ విరాళం ప్రకటించిన ప్రీతి జింటా..

ఆమె మాట్లాడుతూ..” సాయుధ బలగాల కుటుంబాలకు అండగా నిలవడం అనేది మన వంతు బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలు మనం వెలకట్టలేనిది. కానీ మనం వారి కుటుంబాలకు మాత్రం అండగా ఉండి, వారు ముందుకు సాగడానికి మద్దతు నిద్దాం. అందుకే సైనికుల కుటుంబాలు సంక్షేమంగా ఉండాలని ఈ విరాళాన్ని అందజేస్తున్నాను. ఈ మొత్తాన్ని సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ విభాగంలోని వీరనారీమణుల సాధికారతకు , వారి పిల్లల చదువుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయబోతున్నాము” అంటూ ప్రీతిజింటా తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు, ఈమె చేసిన సహాయం పలువురికి అండగా నిలవబోతోందని చెప్పవచ్చు.


ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ టీమ్ కూడా ఒకటి. ఈసారి శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ జట్టు చాలా అద్భుతంగా రాణిస్తోంది. తొలిసారి ట్రోఫీని గెలుచుకుంటామని ధీమాతో కూడా టోర్నీలో ముందుకు సాగుతోంది పంజాబ్ కింగ్స్ టీమ్. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి కూడా అర్హత అందుకుంది.

ప్రీతి జింటా కెరియర్

ప్రీతి జింటా కెరియర్ విషయానికొస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటిగా పేరు తెచ్చుకున్న ఈమె హిందీ సినిమాలతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించింది.క్రిమినల్ సైకాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. 1998లో ‘దిల్ సే’ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె అదే సంవత్సరం ‘సోల్జర్’ అనే సినిమాలో కూడా నటించింది. దిల్ సే సినిమాలో ఈమె నటనకు ఉత్తమ నటి డెబ్యూ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో క్యా కేహనా సినిమాలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈమె ఆ తర్వాత పలు భాషా చిత్రాలలో కూడా అరంగేట్రం చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

ALSO READ:Bollywood: ప్రముఖ నటి విడాకులు.. భర్తకే భరణం చెల్లించిన భార్య.. దానికి మించిన ఆస్తి లేదంటూ?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×