Amardeep: అమర్ దీప్ చౌదరి (Amar Deep Chowdary) పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటుడిగా సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ ఇటీవల కాలంలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక అమర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో అవకాశం వచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అమర్ రన్నర్ గా నిలిచి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత అమర్ ఏకంగా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.
ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అమర్ కు జోడిగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి(Surekha Vani) కుమార్తె సుప్రీత(Supritha) జోడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’(Chowdary Gari Abbayi Naidu Gari Ammayi) అనే టైటిల్ ని ప్రకటించారు. దీంతో ఈ టైటిల్ చాలా భిన్నంగా ఉందని చెప్పాలి. అయితే రియల్ లైఫ్ లో కూడా టైటిల్ కి తగ్గట్టు అమర్ దీప్ సుప్రీత ఇద్దరి క్యాస్ట్ లు అవే కావడంతో టైటిల్ మరింత వైరల్ గా మారింది.
ఇలా వీరిద్దరూ జోడిగా రాబోతున్న ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహించగా,M3 మీడియా బ్యానర్ పై మహా మూవీస్ తో కలిసి మహేంద్రనాథ్ కొండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక సుప్రీత సురేఖ వాణి కూతురుగా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పటివరకు సినిమాలలో నటించకపోయిన ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొనే సుప్రీతకు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారని చెప్పాలి.
?utm_source=ig_web_copy_link
ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రాకముందే ఈమె హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు పొందారు. ఇక అమర్ కూడా ప్రస్తుతం పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలు చేస్తూనే మరోవైపు హీరోగా కూడా అవకాశాలు అందుకొరుతున్నారు. బిగ్ బాస్ తర్వాత అమర్ ఎలాంటి బుల్లితెర సీరియల్స్ కి కమిట్ అవ్వకపోయిన బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇక అమర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అమర్ మరో బుల్లితెర నటి తేజస్విని గౌడను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బుల్లితెరపై మంచి సక్సెస్ అందుకున్న అమర్ దీప్ వెండితెరపై మంచి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వెండితెరపై అమర్ సక్సెస్ అందుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.